1965లో పశ్చిమ బెంగాల్‌ సిలుగురి కొండల్లో సంతాల్‌ తెగ విముక్తి కోసం చార్‌మజుందార్‌ నడిపిన సాయుధ పోరా టం దేశంలోని  దాదాపుగా అన్ని  ప్రాంతాలకు విస్తరించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపించింది . తాడిత , పీడిత వర్గాల విముక్తి కోసం సాగిన ప్రతి పోరాటానికి స్ఫూర్తి ప్రదాత చార్‌మజుందార్‌.  తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి తో సిలుగురి కొండల్లో సంతాల్‌ తెగ విముక్తి కోసం  చారుచార్‌మజుందార్‌ పోరాటం చేశారని  ఉభయ కమ్యూనిస్టు పార్టీ నేతలు అంటుంటారు  .భూమి కోసం, భుక్తి కోసం సాగిన  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లోదున్నేవాడిదే భూమి అని నినదించిన కమ్యూనిస్టులు , ఆనాటి రైతాంగం ...  నిజాం పాలకుల తుపాకీ తూటాలకు తమ గుండెలను ఎదురొడ్డారు . ఈ పోరాటం లో ఎంతోమంది వీర మరణం పొందారు . కమ్యూనిస్టులు నిర్వహించిన ప్రజా ఉద్యమాల్లో,  తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే ఘట్టం . 


 సిలిగురి కొండల్లో చారుచార్‌మజుందార్‌ ప్రారంభించిన  సాయుధ పోరాటం ...  ప్రధానంగా శ్రీకాకుళం వైపు నక్సల్‌బరి పోరాటంగా  నడిచి వచ్చింది. విప్లవోద్యమాలకు చిరునామాగా నిలిచిన చార్‌మజుందార్‌ ప్రభావంతో శ్రీకాకుళం  జిల్లాలో 1974 నుంచి ఎంఎల్‌పార్టీగా కార్యకలాపాలు కొనసాగించారు. 1972 జూలై 28న జైళ్లో అమరుడైన చార్‌మజుందార్‌ వర్ధంతిని 1980లో తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి పీపుల్స్‌వార్‌పార్టీ నిర్వహించింది  .ఆపై అన్ని విప్లవపార్టీలు క్రమం తప్పకుండా ప్రతి ఏటా జూలై 28 నుంచి ఆగస్టు  3 వరకు జరుపుతున్నాయి. నక్సల్‌బరికి 52ఏళ్లు.. దాని సృష్టికర్త భార త విప్లవ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన చారుమజుందార్‌కు ఈ ఏడాది  వందేళ్లు నిండాయి.


మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానాన్ని భారత విప్లవ పరిస్థితులకు అన్వయించుకొని ‘ఖతం’ కార్యక్రమంతో వర్గశత్రు నిర్మూలన పోరాటాన్ని కొనసాగించిన భారత విప్లవపార్టీల పితామహుడు చార్‌మజుందార్‌ వర్ధంతి వేడుకలు ఆదివారం నుంచి దేశ వ్యాప్తంగా  జరగనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: