ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ ఇన్నాళ్లు మీడియా ముందు, ప్రజల ముందు మాత్రమే కామెడీ చేసేవారు. ఇప్పుడు ట్విట్టర్ లో కూడా కామెడీ చేస్తున్నారు. ఈ ట్విట్టర్ కామెడీ మాములుగా లేదు.. అందుకే నెటిజన్లు కూడా ఈ కామెడీని చూసి నవ్వలేక పోతున్నాం ఇంకా ఆపవయ్యా నీ ట్విట్లు అంటూ స్పందిస్తున్నారు. 


అంత నవ్వు వచ్చే ట్విట్ ఎం చేశారబ్బా అని అనుకుంటున్నారా ? అదేనండి. మనం వాట్సాప్ లో కొన్ని వీడియోలని కలిపి వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తాం కదా అవే వీడియోలు ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. బహుశా నారా లోకేష్ కి ప్రతిపక్షాన్ని విమర్శించడానికి ఏమి దొరకలేదు అంటుకుంట అందుకే ఈ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు, అయినా నోరు జారుడు'పై నారా లోకేషే చెయ్యాలి కామెడీ' అని అంటున్నారు నెటిజన్లు. 


నారా లోకేష్ ట్విట్ చేస్తూ 'స్టిక్కర్ ముఖ్యమంత్రి గారి బృందం వారి మాటలు నిజంగా పెద్ద కామెడీ' అంటూ ఓ వీడియోని జత చేసి ట్విట్టర్ లో పెట్టారు. దీంతో కొంతమంది నెటిజన్లు నవ్వుతుంటే మరికొంతమంది 'నువ్వు ట్విట్టర్ కే పరిమితం లోకేషం' అంటూ ట్విట్ చేస్తున్నారు. మరికొందరు 'చాలా ఎదిగిపోయావ్ లోకేష్, నువ్వు గ్రేట్, అస్సలు తగ్గకు అంటూ ట్విట్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: