విజయదేవరకొండ మీద ఇండస్ట్రీలో చాలా మందికి కసి ఉందని ఇప్పటికే పలు సార్లు ప్రూవ్ అయ్యింది. ఓ హిట్ వస్తే పైకి మెచ్చుకుంటారు. లోపల మాత్రం గోతులు తవ్వుతారు. వీడికి మరో హిట్ రావడానికి వీల్లేదన్నట్టుగా పావులు కదుపుతుంటారు. ఇండస్ట్రీని దగ్గరుండి గమనించే వ్యక్తులకు ఈ గోతులు తవ్వే వ్యవహారాలు బాగా తెలుస్తాయి. అలాంటి ఓ బ్యాచ్ ఇప్పుడు విజయ్ దేవరకొండపై తమ ప్రతాపం చూపిస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచీ ఎందుకో ఈ బ్యాచ్ డియర్ కామ్రేడ్ పై పడి ఏడుస్తోంది. అందుకే కాబోలు ఈ  బ్యాచ్ స్ప్రెడ్ చేసిన నెగటివిటీ మరియు డియర్ కామ్రేడ్ సినిమా కూడా స్లో గా ఉండటంతో అన్ని చోట్ల కలెక్షన్స్ పడిపోయాయి. ఓవర్సీస్ లో అయితే పెట్టిన పెట్టుబడి రావటం గగనంగా మారిందని తెలుస్తుంది. 


ఏ హీరో అయినా అతని మార్కెట్ పొటెన్షియాలిటీని బట్టి సినిమాను కొనాలే తప్ప గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ప్రతిదానికీ వస్తుందని ఆశించడం అత్యాశే. అలా వేసిన లెక్కల వల్లే డియర్ కామ్రేడ్ ఇప్పుడు నష్టాలు మిగిల్చే దిశగా పయనిస్తోందని తెలుస్తోంది. వీకెండ్ పూర్తయినా కామ్రేడ్ మిలియన్ మార్క్ చేరుకోలేదు. ఇవాళ వీక్ డేస్ మొదలయ్యాయి కనుక డ్రాప్ ఉంటుంది. వచ్చే వారాంతానికి కొత్త సినిమాలు వచ్చేస్తాయి కాబట్టి పికప్ కోరుకోవడం ఊహకే పరిమితం.


అక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ  పరిస్థితి అంత గొప్పగా ఏమి లేదు. హాలిడేస్ కాబట్టి నిన్న రెండు రోజులు ఓ మాదిరిగా వచ్చాయి కానీ అసలైన ఛాలెంజ్ ఇవాళ్టి నుంచి ఉంది. ఇక డబ్బింగ్ వెర్షన్లో కన్నడ-తమిళ్-మలయాళంలో రిలీజ్ చేస్తే అక్కడ ఆడియన్స్ ఇచ్చిన షాక్ మాములుగా లేదు. షేర్ ఎంత వచ్చిందో చెప్పుకోవడానికి కూడా యూనిట్ ఇష్టపడటం లేదు. ఈ సినిమా వసూళ్లు తగ్గడంతో ఇండస్ట్రీలో కొంత మంది ఫుల్ హ్యాపీగా ఉన్నారని వినిపిస్తున్న మాటలు. ఏది ఏమైనా రౌడీ గారికి ఈ సినిమా రూపంలో పెద్ద దెబ్బ పడిందని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: