కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ముఖేష్ గౌడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. రెండు వేల పధ్ధెనిమిది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అపోలో ఆసుపత్రి లో చేరిన ఆయన అక్కడే చికిత్స పొందారు. ముఖేష్ కి సుమారు ఏడుసర్జరీ లు జరిగాయి అయితే రోజురోజుకి ముఖేష్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది.  వైద్యానికి గౌడ్ శరీరం సహకరించకపోవడం తో అపోలో వైద్యు లు చికిత్స నిలిపివేసి జూబ్లీహిల్స్ లోని ముఖేష్ గౌడ్ నివాసానికి తరలించారు. కొద్ది సేపటి క్రితమే ఆయన తుది శ్వాస విడిచారు. 


గ్రేటర్ హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ మాస్ లీడర్ గా మంచి గుర్తింపు పొందారు హైదరాబాద్ వేళ్ల మీద లెక్కించదగ్గ కాంగ్రెస్ నాయకుల్ లో ముఖేష్ గౌడ్ ఒకరు.. యూత్ కాంగ్రెస్ నేత గా రాజకీయ ఆరంగేట్రం చేసిన ముఖేష్ గౌడ్ కౌన్సిలర్ గా ఆ తర్వాత ఎమ్మెల్యే  ఎదిగి   ఉమ్మడి రాష్ట్రం లో మంత్రి గా సేవలందించారు. మజ్లిస్ హవా మాత్రమే నడిచే హైదరాబాద్ పాతబస్తీ లో జన హృదయం గెలిచినా ప్రజానాయకుడు ముకేష్. 


అన్ని మతాల కులాల భాషల ప్రజలు నివసించే మినీ ఇండియా గా పిలువబడే మహారాజ్ గంజ్ లో మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ముఖేష్ గౌడ్ జులై ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది లో జన్మించారు, ఆయన కు ఇద్దరు కుమారు లు విక్రమ్ గౌడ్, విశాల్ గౌడ్, ఒక కుమార్తె శిల్ప ఉన్నారు. కుమారుడు విక్రమ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నారు. అతి చిన్న వయస్సు లోనే పంతొమ్మిది వందల ఎనభై ఆరు లో కౌన్సిలర్ గా ముఖేష్ గౌడ్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు


పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగు లో మహారాజ్ గంజ్ ఎమ్మెల్యే గా ఇక రెండు వేల తొమ్మిది లో గోషా మహల్ ఎమ్మెల్యే గా గెలుపొందారు. పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు పధ్ధెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు రెండు వేల ఏడు లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గా రెండు వేల తొమ్మిది లో మార్కెటింగ్ శాఖ మంత్రి గా ముఖేష్ గౌడ్ పనిచేసారు. జంట నగరాల్లో ముఖేష్ అంటే ఒక బ్రాండ్ మాజీ మంత్రి దేవందర్ గౌడ్ కి స్వయానా మేనల్లుడు ప్రస్తుతం ముఖేష్ లేరనే వార్త ని కుటుంబ సభ్యులు ఆయన అనుచరులు జీర్ణించుకోలేపోతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: