ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ట్విట్టర్ లో ఆర్థికశాఖ మంత్రి 'బుగ్గన'పై కామెడీ ట్విట్ చేశారు. కానీ ఆ ట్విట్ అతని తండ్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే వర్తిస్తుందని నెటిజన్లు ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. 


ట్విట్టర్ లో ఎప్పుడు యాక్టీవ్ ఉండే నారా లోకేష్ పై జోకులు భారీగా పేలుతున్నాయి. అయన చేసిన ట్విట్లు అయన మెడకే చుట్టుకుంటున్నాయిని అంటున్నారు నెటిజన్లు. ఒక మాజీ మంత్రి అయి ఉండి 'వాట్సప్ ఫార్వార్డ్'లు ట్విట్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారని నెటిజన్లు పేర్కొన్నారు. 2024 లో అతను అధికారంలోకి రావాలంటే అతను ట్విట్టర్ వదిలి ప్రజలలోకి రావాలని, మీడియా ముందు మాట్లాడాలని నెటిజన్లు మండిపడుతున్నారు. 


ఇంతటి గాటు సమాధానాలు రావడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారు కదా అదేనండి నారా లోకేష్ ఈరోజు కూడా వైసీపీ నేతలపై ట్విట్ చేసాడు. మంత్రి బుగ్గన మాట్లాడే అబద్దపు మాటలు చివరికి అతనికే చుట్టుకుంటాయని కామెడీగా ఉన్న వీడియోని ట్విట్ చేశాడు నారా లోకేష్. ఆ ట్విట్ చుసిన నెటిజన్లు ఇలా స్పందించారు. నారా లోకేష్ ట్విట్ చేస్తూ 'బుగ్గన బబుల్ గమ్ పెట్టుకున్నట్టుగా...  అప్పటికప్పుడు ఓ అబద్దాల బుడగని బయటకు తీస్తారు బుగ్గనగారు. పాపం! అది సాగి సాగి ఆయన ముఖానే టప్పున పేలుతుంది. * Whatsapp Forward * 😜🤣😆' అంటూ ట్విట్ చేశారు. మరి ఈ ట్విట్ కి బుగ్గన ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: