2008లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో తొలుత యువరాజ్యం విభాగానికి అధ్యక్షులుగా వ్యవహరించిన హీరో పవన్ కళ్యాణ్, అప్పటి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలవడంతో రాజకీయాలకు కొంత కాలం దూరంగా వ్యవహరించారు. ఇక 2014 లో స్వయంగా తానే జనసేన పేరుతో పార్టీని నెలకొల్పడం, అలానే అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో టిడిపికి మద్దతివ్వడం జరిగిపోయాయి. ఇక అప్పటినుండి పార్టీని మెల్లగా బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లిన పవన్, మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో ఒంటరిగా ప్రత్యక్ష బరిలోకి తమ పార్టీని నిలిపారు. అయితే వారి పార్టీ కేవలం ఒకే ఒక్క సీట్ గెల్చుకోవడం, అలానే పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమిపాలవడం కొంత ఆ పార్టీని అంతర్మథనంలో పడేసింది. 

ఇక అప్పటినుండి, ఇకపై రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధిపై మరింతగా దృష్టిపెట్టిన పవన్, పార్టీని ప్రజలకు మరింతగా చేరువ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే జనసేనకు మొన్నటి ఎన్నికల్లో కేవలం ఒకేఒక్క సీట్ రావడానికి కొన్ని కారణాలు కూడా లేకపోలేవని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాస్తవానికి టిడిపి మరియు వైసిపి పార్టీ మాదిరిగానే జనసేన కూడా ఒక సామజిక వర్గానికి చెందిన పార్టీగా కనపడుతోందని, అందుకు కారణం అధినేత పవన్ కళ్యాణ్ కాదని, అందులో వ్యవహరించే కొందరు నాయకులు, కార్యకర్తలే అని అంటున్నారు. పవన్ పార్టీ స్థాపన దగ్గరినుండి ఇప్పటివరకు తాను అందరివాడినని గట్టిగా చెప్తూ  వస్తున్నప్పటికీ, అయన సామజిక వర్గానికి చెందిన కొందరు వ్యవహరించే తీరువలన ఆ పార్టీ కేవలం ఆ ఒక్కసామాజిక వర్గానికి చెందినదనే ముద్రపడుతోందట. కాబట్టి ఆ ముద్రను పవన్ వీలైనంత త్వరగా పోగొట్టాలని, ఎందుకంటే అటువంటి చిన్న అంశాలే పార్టీకి కొంత ముప్పు తెస్తాయని వారు అంటున్నారు. 

వాస్తవానికి పవన్ కు అన్ని వర్గాల్లోనూ మంచి క్రేజ్ తో పాటు అభిమానులు కూడా ఉన్నారు. అంతేకాక ఆయన మొన్నటి ఎన్నికల సమయంలో అన్ని వర్గాల వారికి కూడా సమాన సీట్లు కేటాయించారని, అయితే అక్కడక్కడా కొందరి చర్యల వలన తమ పార్టీపై ఒకే సమాజిక వర్గానికి చెందిన పార్టీ గా ముద్రపడుతోందని, కాబట్టి పవన్ గారు ఈ విషయమై రాబోయే రోజుల్లో మరింతగా గట్టిగా చర్యలు తీసుకోవాలని జనసేన లోని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. కాబట్టి పవన్, ఇకపై తమ పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లి, అన్ని వర్గాలను చేరువయ్యేలా వ్యవహరిస్తే, రాబోయే 2024 ఎన్నికల సమయానికి జనసేనకు చాలావరకు మేలు చేకూరే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: