కర్షకులకు వ్యవసాయ అవగాహన కల్పించడంలో ' రైతు సేవ యాప్‌ ' ఒక అరుదైన సాఫ్ట్‌ వేర్‌. అధిక దిగుబడి సాధించే మార్గాలు, ఎరువులు, భూసారం, సేంద్రియ సాగు, మోదలైన అంశాల పై రైతులకు అవగాహన కల్పించే యాప్‌ ఇది. ఇప్పటికే రైతులు దీనిని విరివిగా వాడుతున్నారు.


ఈ యాప్‌లో ఏముందీ?

ఇందులో వ్యవసాయ సమగ్ర సమాచారం ఉంటుంది. దీని ద్వారా రైతులు ఎప్పటికప్పుడు సస్య సంరక్షణలో జాగ్రత్తలు తీసుకొని పంటను కాపాడుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ యాప్‌ కేవలం వ్యవసాయ సమాచారం మాత్రమే ఇస్తున్నది. ఇకపై పశుపోషణ, ఉద్యాన పంటలు. నర్సరీల నిర్వహణ తదితర అంశాలపై అరుదైన సమాచారం అందించనుంది. సాగులో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులకు అవగాహన కలిగిస్తుంది. సాంకేతికతను వినియోగించుకుంటే తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు రైతు సేవా యాప్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.


వివిధరకాల భూములకు అనుగుణంగా ఎంచుకోవాల్సిన వరి, వంగడాలు, విత్తనాల లభ్యత, ఎరువుల వినియోగం, నీటి లభ్యత, పంటల వివరాలను యాప్‌ ద్వారా పొలంలో ఉండే తెలుసుకోవచ్చు. అరచేతిలో అన్నీ... మామూలుగా అయితే రైతులు ఈ సమాచారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. ప్రస్తుతం అందరూ ఆండ్రాయిడ్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు. రైతు కుటుంబాల్లోకి కూడా ఈ ఫోన్లు వచ్చేశాయి. రైతులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగించుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


అవగాహన పెంచే యాప్‌

ఈ ఖరీఫలో వ్యవసాయ సంబంధ సమాచారం కోసం రైతులు ఈ యాప్‌ను వాడుకోవచ్చు. గ్రామాల్లో నిర్వహించే పొలంబడి సభల్లో యాప్‌ వినియోగంపై వ్యవసాయ అధికారులు రైతులకు వివరిస్తున్నారు. విత్తనాల పంపిణీ మొదలైనవి కూడా యాప్‌ల ద్వారానే నిర్వహిస్తున్నారు. దీంతో దీనిపై రైతులకు అవగాహన పెరుగుతోంది. వ్యవసాయ శాఖల సమాచారం..: వ్యవసాయ అనుబంధ శాఖల సమాచారం కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. పశువులు, చేపల సాగు సమాచారం కూడా తెలుసుకోవచ్చు. వాతావరణ మార్పు వల్ల తలెత్తే సమస్యల వల్ల రైతులు తరచూ ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయాల్లో ఈ యాప్‌ ద్వారా మంచి సలహాలు పొందడానికి అవకాశం ఉంటుంది.


ఉద్యాన పంటలు సమాచారం కూడా ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. సాగులో యంత్ర పరికరాల వినియోగం పెరుగుతుంది. కూలీల సమస్యలతో యంత్రాలు అవసరంగా మారాయి. ప్రభుత్వం కూడా యంత్ర పరికరాలను రాయితీపై అందిస్తుంది. దీంతో పాటు పలుచోట్ల యంత్రాలను అద్దె ప్రాదిపదికన కూడా అందిస్తుంది. పరికరాలు దొరికే చోటు, రాయితీ వగైరా వివరాలు అందిస్తారు. రైతు సేవ యాప్‌ను రైతులందరు వినియోగించుకోవాలి. ప్రస్తుతం ప్రతి రైతు కుటుంబంలో ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్న సెల్‌ఫోన్‌ను ఎవరో ఒకరు వాడుతుంటారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే వ్యవసాయ సంబంధ సమాచారం చేతిలో ఉన్నట్లే. వ్యవసాయ అధికారులు అంటున్నారు. (గూగుల్‌ ప్లేస్టోర్‌ నుండి ' రైతుసేవ యాప్‌ ' డవున్‌ లోడ్‌ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: