మొత్తానికి  ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు ఎల్లో మీడియా సర్వ శక్తులు ఒడ్డుతుంటే..  ఒకపక్క ఓటమి పాలైన వారంతా ఇతర పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే  చాలా మంది నేతలు పార్టీనీ వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోతున్నారు. అయితే ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు మరియి కొందరు సీనియర్ నేతలు టీడీపీనీ వీడి బీజేపీలో చేరిపోగా  తాజాగా టీడీపీనీ వీడి బీజేపీలో చేరడానికి మరో నేత సిద్దమయ్యాడు.  టీడీపీ నేత మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డిని బీజేపీ నేతలు రాం మాధవ్ కలిసి పార్టీలోకి రావలసిందిగా కోరారట.  అయితే ఈయన గత నంద్యాల ఉప ఎన్నికల నుంచి టీడీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఈయన పార్టీనీ వీడి బీజేపీలోకి చేరుతారని పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి.   


మరో పక్క ఇప్పుడు ఉన్నవారిని ఎక్కడకి పోనివ్వకుండా చూసుకోవడం చంద్రబాబు తలకు మించిన భారం అవుతుంది.  ఇదిలా ఉండగా జగన్ మరియు పవన్ దెబ్బకు ఇక తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా భూస్థాపితం అయ్యిపోతుందని అంతా అనుకుంటున్నా తరుణంలో  ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఈ పార్టీను ఎలా అయినా సరే మళ్ళీ పూర్వ స్థితికి తీసుకురావాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీ తక్కువ మంది ఎమ్మెల్యేలే ఉన్నాసరే తమ గళాన్ని బలంగా వినిపించడం అలాగే నారా లోకేష్ ను రాజకీయాల్లో మరింత బలంగా తయారు చేసే దిశగా అడుగులు వేయిస్తూ ప్రత్యర్ధ పార్టీపై విమర్శలు చేయిస్తున్నారు.   


దీనికి తోడు  తన సో కాల్డ్  ఎల్లో  మీడియా ఛానెళ్ల ద్వారా ఇలాంటి నిస్సహాయత పరిస్థితుల్లో కూడా చంద్రబాబు తాను ఒక్కడై పార్టీను నడిపిస్తూ  తనని మాత్రమే కార్నర్ చేసేసారు అన్నట్టుగా ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి  ఆ పార్టీ పై మరియు ప్రజల్లో ఒక సింపతీని తీసుకొచ్చే ప్రయత్నం ఈ మధ్య కాస్త గానే జరుగుతుంది. మరి వీరి విశ్వ ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి. అయితే మరో ఐదేళ్ళలో కూడా టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపించడంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: