శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని  పర్యటించిన కలెక్టర్ జె.నివాస్ ఆస్పత్రిలో రోగుల విభాగంలో లైట్లు వెలగడం లేదని, ఫ్యాన్లు పనిచేయడం లేదని, కిటీకీలు అధ్వానంగా ఉన్నాయని, మరుగు దొడ్లు కంపు కొడుతున్నాయని  ప్రభుత్వ ఆస్ప త్రిని నిర్వహించేది ఇలాగేనా  అంటూ కలెక్టర్ జె.నివాస్ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ విభాగంలో రక్త పరీక్షల విభాగం, ఎక్స్-రే యూనిట్, రోగుల విభాగం, డయాలసిస్, ట్రామాకేర్, కంటి పరీక్షల విభాగం , ఎస్ఎన్ సీ యూనిట్ , బ్లడ్ బ్యాంక్ తో పాటు ఆస్పత్రిలో అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు.

లైట్లు , ఫ్యాన్లు బాగు చేయకుండా ఏం చేస్తున్నారని  నేను వచ్చి చెబితే తప్ప వాటిని రిపేర్ చెయ్యరా...అంటూ కలెక్టర్ జె.నివాస్ ఆసుపత్రి సింబంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రోగుల విభాగంలో కిటికీలు అధ్వానంగా ఉండడంపైనా అసహనం వ్యక్తం చేశారు. కిటికీల పరిస్థితి ఇలా ఉంటే వానలు పడే సమయంలో రోగులు ఎలా ఉంటారని ప్రశ్నించారు.  సొంత ఆస్పత్రులైతే ఇలాగే నిర్వహిస్తారా అని నిలదీశారు. అనంతరం మరుగుదొడ్లను పరిశీలించి, వీటి పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేలేదని అన్నారు.

ఇదిలా  ఉండగా తమకు 8 నెలల నుంచి వేతనాలు అందడంలేదంటూ ఆసుపత్రి సిబ్బంది కలెక్టర్కు విన్నమించుకున్నారు. తాము ఏమి తిని పనిచేయాలంటూ వారంతా కలెక్టర్‌ను ప్రశ్నించారు. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, దినసరి భృతికి చాలా కష్టమవుతోందని వారంతా వాపోయారు. సుమారు 10 ఏళ్లకు పైబడి ఆసుపత్రిలోనే సేవలందిస్తూ ఇక్కడే జీవన భృతి పొందుతున్నామని, ఇటీవల 8 నెలలుగా వేతనాలు చెల్లించక అనేక అవస్థలు పడుతున్నామని వారు కలెక్టర్‌ నివాస్‌ ఎదుట వాపోయారు.



మరింత సమాచారం తెలుసుకోండి: