మోదీ ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే మరో కీలక బిల్లును ఆమోదించింది. కొద్ది రోజుల క్రితం లోక్ సభలో పాసయినా యాంటీ టెర్రరిస్టు బిల్లుకూ ఇవాళ రాజ్య సభ కూడా ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి గెజిట్ తో ఇది చట్ట రూపం దాల్చటమే తరువాయి భాగం. బిల్లుకు అనుకూలంగా నూట నలభై రెండు ఓట్లు, వ్యతిరేకంగా నలభై రెండు ఓట్లు వచ్చాయి. అంతకుముందు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న ప్రతిపక్షాల తీర్మానంకు తెరపడింది. గతంలోనే యాన్టీ టెర్రరిస్ట్ యాక్ట్ ఉన్నప్పటికీ దానికి చేసిన కొన్ని సవరణలతో పదును పెరిగింది.



ఇంతకుముదు ఉగ్రవాదానికి సంబంధించిన కేసు దర్యాప్తు చేయాలంటే డిఎస్ పి ఎసిపి ర్యాంక్ ఉన్న అధికారులే చేసేవారు, కానీ కొత్త బిల్లుతో ఎస్సై ర్యాంక్ అధికారి కూడా దర్యాప్తు చేయొచ్చు. మన దేశంలో ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం సంస్థలపై మాత్రమే టెర్రిరిస్టు గ్రూపుల ముద్ర వేసే అవకాశం ఉంది. కానీ కొత్త బిల్లతో ఇపుడు వ్యక్తులపై కూడా ఉగ్రవాదిగా ముద్ర వేయొచ్చు. గతంలో ఎన్ ఐ ఏ రాష్ట్రాల్లో ఉగ్రవాదానికి సంబంధించి దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర పోలీసుల అనుమతి తప్పనిసరి, కాని తాజా బిల్లుతో ఎన్ ఐ ఏ ఎక్కడైనా ఎప్పుడైనా స్వతంత్రంగా దర్యాప్తు చేయొచ్చు.




అంతేకాదు గతంలో టెర్రరిస్టుల ఆస్తులు జప్తు చేయాలంటే పెద్ద తతంగం ఉండేది, కానీ ఇప్పుడు ఎన్ ఐ ఏ డీజీ ఉగ్రవాద ఆస్తులను సీజ్ చేసే అవకాశం చాలా తేలికగా మారింది. ఈ బిల్లు వల్ల దేశంలో ఉగ్రవాదాన్ని చాలా వరకూ అరికట్టొచ్చని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. చేతిలో అధికారం ఉంటే దర్యాప్తు సంస్థలు ఇంకాస్త వేగంగా పనిచేస్తాయనీ, ఈ బిల్లు ఉగ్రవాదుల పాలిట యమపాశాలు లాంటిదని పేర్కోన్నారు మన హోంశాఖ మంత్రి  అమిత్ షా. ఈ బిల్లు సవరణ వల్ల దేశ భద్రతలో ఎలాంటి మార్పులు వస్తాయో ,ఉగ్రవాదాన్ని ఎలా ఎరికట్టచ్చో వేచి చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: