హైదరాబాద్ మహానగర మంచి నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల మండలి ఆదాయాన్ని పెంచుకునేందుకు దృష్టి సారించింది. ఈ క్రమంలో అక్రమనీటి వినియోగాన్ని కట్టడి చేసేందుకు నిర్దిష్టమైన వైఖరిని అవలంభించనున్నది. అందులో భాగంగానే విశ్వనగరంలో అమలవుతున్న 
కమర్షియల్ కనెక్షన్లకు ఎమ్మార్ మీటర్ల బిగించేందుకు సమాయత్తమైంది. మొదటగా కమర్షియల్ వినియోగదారులకు నోటీసులు చేయనున్నారు. మీటర్ల బిగింపు ఖర్చు  జలమండలిదే మేనేజింగ్ డైరెక్టర్ ఎం. దాన కిషోర్ వెల్లడించారు. సంవత్సరం  పాటు బిల్లులో సమాన వాయిదాల్లో తిరిగి వసూలు చేస్తామన్నారు.


అక్రమ, కమర్షియల్ కనెక్షన్లను గుర్తించేందుకు 4 టాస్క్ ఫోర్స్  బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆ బృందాలకు  అదనంగా మరో 50 మంది పోలీసు సిబ్బందిని నియమించనున్నామని చెప్పారు. అక్రమంగా మోటార్లను బిగించి నీటిని తోడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  మొదటి సారి పట్టుబడితే 5వేలు, రెండవసారి 10వేలు, మూడవ సారి పట్టుబడితే శాశ్వతంగా కనెక్షన్ల తొలగింపు, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఎండీ ఎం. దానకిషోర్ స్పష్టం చేశారు.
 
ఇప్పటీకే జలమండలి సరఫరా చేస్తున్న నీటిని రోడ్లమీద వదిలిపెట్టే వాళ్లను వాక్ కార్యక్రమంలో భాగంగా గుర్తించి జల సంరక్షణ చర్యలు చేపడుతున్న జలమండలి... ఇకపై రెవెన్యూ పెంపు దిశగా కసరత్తు చేస్తుంది. నగరంలో ఉన్న 9లక్షల కనెక్షన్లకు 40వేల కమర్షియల్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో చాలా వరకు మోకానికల్ మీటర్లు ఉండడం, మీటర్లు చెడిపోవడం వంటి వాటితో వారికి సరఫరా అవుతున్న నీరు లెక్కలోకి రాకుండా పోతుంది. దీంతో వారు అందరీ మాదిరిగానే సగటున బిల్లు చెల్లిస్తున్నారు. 


అయితే జలమండలి రెవెన్యూ పెంపు, వాణిజ్య వినియోగదారులకు ఎమ్మార్ మీటర్ల బిగింపు వంటి అంశాలపై శుక్రవారం రోజున ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో  రెవెన్యూ విభాగం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఎండీ మాట్లాడుతూ వాణిజ్య వినియోగదారులకు ఎమ్మార్ మీటర్లు బిగించనున్నట్లు తెలిపారు.  ఇంతకుముందు ప్రయోగాత్మకంగా పలు ప్రాంతాల్లో 4వేల కమర్షియల్ కనెక్షన్లకు ఎమ్మార్ మీటర్లు బిగించడం వల్ల బిల్లింగ్, రెవెన్యూలో మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. 

కాబట్టి ఈ ఎమ్మార్ మీటర్లను నగర వ్యాప్తంగా ఉన్న కమర్షియల్ వినియోగదారులకు జలమండలి స్వంత ఖర్చులతోనే ప్రస్తుతం ఏర్పాటు చేసి, సంవత్సరం కాలం పాటు వాయిదా పద్దతిలో తిరిగి వసూలు చేయడం జరుగుతుందని వివరించారు.  ఈ మీటర్లను ఏర్పాటు చేయడం వల్ల కమర్షియల్ వినియోగదారులు వినియోగిస్తున్న నీటిని ఎమ్మార్ మీటర్లు ఖచ్చితత్వంతో తెలుపుతుందని...  కాబట్టి జలమండలి రెవెన్యూ కొంతమేర పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. కాబట్టి అన్ని కమర్షియల్ కనెక్షన్లకు ఎమ్మార్ మీటర్ల బిగింపు ప్రక్రియ చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
 
అలాగే అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించడానికి 4 టాస్క్ ఫోర్స్ బందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. టాస్క్ ఫోర్స్ బృందాల ఏర్పాటు కోసం అదనంగా 50మంది పోలీసు సిబ్బందిని డిప్యూటేషన్ పై తీసుకోవడం జరుగుతుందన్నారు. వీరు అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించడం, అలాగే డొమెస్టిక్ కనెక్షన్ అనుమతి తీసుకుని వాణిజ్య అవసరాలకు జలమండలి నల్లా కనెక్షన్లను వినియోగిస్తున్న వారిని గుర్తించడం కోసం  బృందాలు పనిచేస్తాయని తెలిపారు.
 
వీటితో పాటు జలమండలి సరఫరా చేస్తున్ననీటిని నల్లాలకు మోటార్లు పెట్టి నీటిని తోడితే కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 
నల్లాలకు మోటార్లు బిగించి మొదటిసారి పట్టుబడితే రూ. 5వేలు జరిమానా, రెండవ సారి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా విధించడం జరుగుతుంది. మూడవ సారి పట్టుబడితే శాశ్వతంగా నల్లా కనెక్షన్ తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎండీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: