ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీ సాధించి ముఖ్య మంత్రి పీఠంపై జగన్ మోహన్ రెడ్డిని  కూర్చోబెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.  ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినప్పటి హామీల విషయంలో ఇప్పుడు అందరికీ అనుమానాలొస్తున్న పరిస్థితి ఉంది.  ఇప్పటికే నలభై రోజుల పాలన పూర్తయ్యింది. పలు ప్రాంతాల్లో ప్రజలు మాత్రం కొంత వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితులున్నాయి.

గతంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల విషయంలో, ఎన్నికల ముందు ఇచ్చిన వాటికి ఇప్పుడు  అమలు పరుస్తున్న దానికి చాలా తేడాలు ఉన్నాయి. మరి అవి అమలుకు సాధ్యమవుతాయా కాదా అనేటువంటి మాత్రం ప్రతి ఒక్కరు కూడా అనుమానించాల్సిన  పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.  నవరత్నాలకు సంబంధించి అనేక అంశాలు తెరమీదకు తీసుకొస్తున్నారు. మద్యపాన నిషేధాన్ని కానీ,  అమ్మ ఒడి పథకానికి సంబంధించి పింఛన్ విషయం అంటే, ప్రధానంగా ముఖ్య మంత్రి అయిన తరువాత మొదటి సంతకం పెట్టింది వృద్దులకూ పింఛన్ కు సంబంధించినది. కానీ ఈ విషయంలో మూడు వేల పింఛన్ ఇస్తామని  ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.

కానీ ప్రస్తుతం రెండు వేల రెండు వందలు మాత్రమే ఇస్తున్నారు.ఈ విషయంలో జగన్మోహనరెడ్డి మాట తప్పారనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినిపిస్తుంది. అయితే ఎన్నికల ముందు మాత్రం అంశాల వారిగా పెంచుకుంటూ వెళ్తామనే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి మ్యానిఫెస్టో లో పెట్టటం జరిగింది అదే విధంగా చెప్పడం జరిగింది మరి ప్రజల్లోకి  అది వెళ్లిన విధానం మాత్రం కరెక్ట్ గా వెళ్లలేకపోయింది. మద్యపాన నిషేధం కానీవండి అదే విధంగా గ్రామ వాలంటర్లీకు సంబంధించిన విషయాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అమలు పర్చడానికి నిధులు ఎలా సమకూరుస్తారు.

ఎందుకంటే  తెలంగాణ రాష్ట్రంలాగా ఇది వడ్డించిన విస్తరైతే కాదు లోటు బడ్జెట్ రాష్ట్రం కాబట్టి  ఏ విధంగా ముందుకెళ్తారు.? బిజెపి పార్టీ మద్దతు కూడా ఎలా ఉంటుందని మాత్రం చూడాలి. పార్లమెంటులో ఇప్పటికే బిజెపి పార్టీ ప్రవేశ పెట్టిన బిల్లులకు  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వని  పరిస్థితి ఉంది. మరి ఇలాంటి విషయాల్లో  ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిధులు ఏ విధంగా సమకూరుస్తారని  ప్రతి ఒక్కరికీ ఉన్నటువంటి అనుమానం.  
ప్రధానంగా  చూసుకుంటే మాత్రం రెండే రెండు హామీలు టిడిపి పార్టీకి బలమైన ఆయుధాలుగా మారే అవకాశం కనిపిస్తుంది.


ఒకటి అమరావతి రాజధానికి సంబంధించి ఒకటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రైన తర్వాత  గతంలో టీడీపీ హయాంలో జరిగిన అవినీతి మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తుంది. అంటే ప్రజావేదికకు సంబంధించి  ఆయన అక్కడ అవినీతి జరిగిందని, అక్రమ కట్టడం అని కూల్చేశారు. వచ్చిన నెల రోజుల్లోనే  పోలవరానికి సంబంధించి చూస్తే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి  నవయుగ కాంట్రాక్టు సంస్థని వైదొలగించి మళ్లీ రీ టెండరింగ్ పెట్టాలని ఆలోచించారు. పోలవరంలో భారీ అవినీతి జరిగింది. ఖచ్చితంగా మళ్లీ టెండర్ లు వేసి ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని  జగన్ మోహన్ రెడ్డి పేర్కోన్నారు.దీనికి సంబంధించినటువంటి నిధులు కేంద్రం నుంచి ఏ విధంగా రాబడతారనేది మాత్రం మిలియన్ డాలర్ ల ప్రశ్నగా మారింది.


అదే విధంగా అమరావతి రాజధానికి సంబంధించినంత  వరకూ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో  చర్చలు జరపడం గానీ దానిపట్ల ఒక నివేదిక తెప్పించుకోవడం కానీ చేయలేదు.  అమరావతి రాజధానిలో కూడా భారీ కుంభకోణాలు జరిగాయి. రైతుల నుంచి అక్రమంగా భూములు లాక్కున్నారని  ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి  ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యం  అసలు అమరావతి రాజధానిగా ఉంటుందా, మారుతుందా అనేటువంటిది మాత్రం ఆ ప్రాంతాల్లో  పెట్టుబడులు పెట్టాలన్న ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.తాజాగా  ప్రపంచ బ్యాంకు కూడా ఏదైతే అమరావతి రాజధానికి కావల్సినటువంటి నిధులిస్తామని చెప్పారో అవి కూడా వెనక్కి వెళ్తున్నాయి.


అమరావతి రాజధాని పూర్తవుతుందా లేదా అని ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రక్రియ  మాత్రం వైఎస్ జగన్ మోహన్ చేయలేకపోయారని ప్రజలు భావిస్తున్నారు. రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం కూడా చాలా ముఖ్యమైనది. తొందరగా నిర్మాణం గనుక జరిగితే మాత్రం పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా కోల్పోతామని మనకు తెలుస్తోంది.ఈ రెండు అంశాలను జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా చేయబోతున్నారని చూడాలి.


ఒకవేళ విజయం సాధిస్తే మాత్రం చరిత్రలో జగన్మోహన్ రెడ్డి పేరు నిలిచిపోతుందని,చెయ్యలేకపోతే మాత్రం ఖచ్చితంగా టిడిపి పార్టీ కి అతి ప్రధాన ఆయుధంగా మారే అవకాశముందని, వచ్చే ఎన్నికల్లో టిడిపి పార్టీ అధికారం రావటానికి ప్రధానంగా ఈ రెండు అంశాలు చెప్పొచ్చు.  ప్రత్యేక హోదా విషయం పై  ప్రజలు కూడా ఆశ వదులుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్తితిని మన యువ ముఖ్యమంత్రి ఎలా చేపడతారో వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: