జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో పాలనను నడిపిస్తున్నారు. సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన రెండు నెలలు కాకముందే మొదటి అసీంబ్లీలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన పరిపాలన ఎలా ఉండబోతుందో మొదటి రెండు నెలల్లో అర్ధం అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలకు చూపించారు. చాలా కీలక బిల్లులు అయిన ఉదాహరణకు వెనుకబడిన తరగతులకు నామినేటెడ్ పదవులకు 50 శాతం రిజర్వేషన్స్ అయితేనేం, అలాగే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కీలక సంస్కరణల కోసం కొత్త చట్టాన్ని తీసుకురావటం.. ఇవన్నీ పేద ప్రజలకు మేలు చేసేవి. 


అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్ని చేసిన ప్రతిపక్షం పార్టీలు ఏదోకటి చేస్తే గాని వాటి మనుగడ కష్టం. అందుకే జగన్ ప్రభుత్వానికి 5 నెలలు గడువు ఇచ్చి అక్టోబర్ నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ దిశగా కార్యాచరణ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అక్టోబర్ నుంచి తనలోని అసలైన రాజకీయ నాయకుడిని చూస్తారంటూ చెప్పుకొచ్చిన సంగతీ మనకు తెలిసిందే. అయితే అక్టోబర్ నుంచి వీరి పోరాటాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరం. 


అలాగే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ కూడా జగన్ ప్రభుత్వం మీద గట్టిగా విమర్శలు చేస్తూ ప్రజల్లో తిరగాలని ప్లాన్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అమెరికాకు వెళ్లారు. తన ఆరోగ్యం గురించి చెక్ అప్ లు చేయించుకొని తిరిగి ఏపీకి బయలుదేరనున్నారు. అయితే అక్టోబర్ నుంచి ఇటు జనసేన పార్టీ అటు టీడీపీ పార్టీ .. జగన్ సర్కార్ ను ఎలా ఎదుర్కొనబోతుందని ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మరీ చూడాలి అక్టోబర్ నుంచి అసలైన రాజకీయం ఎలా ఉండబోతుందో !

మరింత సమాచారం తెలుసుకోండి: