సంగమేశ్వరాలయం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం. కృష్ణా తీరంలోని పుణ్యక్షేత్రం సంగమేశ్వరాలయం క్రమంగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుకుంటుంది. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో సప్తనదుల సంగమ ప్రదేశంలో వెలిసిన సోమేశ్వరాలయంలోకి కృష్ణా జలాలు వచ్చి చేరాయి. గత పదిహేను రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం రిజర్వాయర్ కు వరద నీరు పోటెత్తుతోంది. జలాశయం జలసిరితో కళకళలాడుతోంది. జూరాల నుంచి పరుగులు పెడుతూ వస్తున్న నీటితో శ్రీశైలం బ్యాక్ వాటర్ తో సంగమేశ్వర ఆలయం క్రమంగా నీటిలో మునిగిపోతోంది.






ఇప్పటికే గర్భాలయంలోకి నీరు వచ్చింది. వరద ప్రవాహం ఇలాగే ఉంటే మరో వారం రోజుల్లో గుడి పూర్తిగా మునిగి పోనుంది. ప్రతి యేటా కొన్ని నెలల పాటు కృష్ణమ్మ ఒడిలోనే ఒదిగిపోయి, పూజలకు దూరంగా వుంటాడు సంగమేశ్వరుడు. ఆలయం నీట మునిగిపోతుండడంతో పూజారి, భక్తులు ఈ ఏడాదికి చివరి సారిగా గుడిలో పూజలు నిర్వహించారు. జనవరి ఒకటవ తేదీన మొదలైన పూజలు నేటితో ఆగిపోతున్నాయని పూజారి తెలిపారు. సప్తనదుల సంగమేశ్వరాలయము ఈ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి బయట పడి ఈరోజు గర్భాలయంలో నీళ్లు ప్రవేశిస్తున్నాయి. దాదాపు ఏడు నెలల పాటు భక్తులకు స్వామి దర్శనం ఇవ్వడం జరిగింది.2018వ సంవత్సరం జూలై 20వ తారీకు గర్భాలయంలోకి నీళ్లు రావడం జరిగింది.






ఈ సంగమేశ్వర క్షేత్రంలో మనం వరుణ యాగం చేయడమూ రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం చేసిన ఈ వరుణ యాగం సత్ఫలితాలిచ్చిందని ఎన్నో సార్లు ఋజువయ్యింది. జూరాల నుంచి వస్తున్న నీటితో సంగమేశ్వరాలయం పూర్తిగా మునిగిపోయిందనీ పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులు చెబుతున్నారు. యాత్రికులు కూడా జలాశయం దగ్గర జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.






మరింత సమాచారం తెలుసుకోండి: