ఆయన తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నేత, ఒకప్పుడు కనుసైగలతోనే అందరినీ శాసించాడు కోడెల శివ ప్రసాద్. గట్టిగా ఉరిమి చూసే ఖాకీలను గజగజ వణికించాడు. పార్టీలో ఇతర నేతలను తన అధికారంతో డామినేట్ చేశారు. మరిప్పుడు సీన్ రివర్సైంది. సొంతవారే దగ్గరకు రానివ్వడం లేదు. పార్టీ వెలేసింది. ఆయన్ను చూసి భయపడ్డ ప్రజలు ఇప్పుడా పేరు వింటేనే ఛీదరించుకుంటున్నారు. అధికారం పోవటంతో అవస్థల పాలవుతున్నారు.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, సమయం గడిచే కొద్దీ ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి, అచ్చం కోడెల శివప్రసాదరావు లాగా.





కోడెల శివప్రసాదరావు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, ఎన్టీఆర్ కుటుంబానికి చాలా దగ్గరివాడు. అలాంటి వ్యక్తి రాజకీయంగా ఇప్పుడు అత్యంత హీన స్థితిలో ఉన్నారు. ఇదంతా స్వయంకృతాపరాధమే అనేది నియోజకవర్గంలో అంతా చెప్పేమాట. అధికారం తమకు కవచ కుండలము అనుకొని కోడెల ఆయన కుటుంబం చేసిన ఆరాచకాలే ఇప్పుడు ఈ దుస్థితికి చేర్చాయని చెబుతున్నారు. మంచి చెడు అనే బేధం లేకుండా తన మన అనే తేడా లేకుండా అరాచకానికి కేరాఫ్ అడ్రస్ లా వ్యవహరించారు. గడిచిన 5 ఏళ్ళలో కోడెల శివప్రసాదరావు చెయ్యని దుర్మార్గపు పనులు లేవని నియోజకవర్గంలో సాధారణ ప్రజలు కూడా చెప్తారు.





తన సొంత మనుషుల్ని సొంత కార్యకర్తల్నీ కూడా దోచుకున్న కథలు లెక్కలేనన్ని ఉన్నాయి. గుడి ముందు కొబ్బరికాయలు అమ్ముకుని చిరు వ్యాపారి నుంచి రైల్వే కాంట్రాక్టర్ల వరకు అందరి నుంచి కమీషన్ లు గుంజుకున్న ఏకైక నాయకుడు కోడెల శివప్రసాదరావు ఆయన కుటుంబ సభ్యులని సొంత పార్టీ కార్యకర్తలే బాహాటంగా చెబుతున్నారు. ఓ కార్యకర్త కోడెల అరాచకాల స్థాయిని గురించి ఇలా చెప్పారు, గతంలో పెద్ద నోట్లు రద్దు అయినప్పుడు దాదాపు మూడు కోట్ల రూపాయలను కోడెల శివప్రసాదరావు మార్చాల్సి వచ్చింది. అందుకోసం కొందరు బ్యాంకర్ లు, మరి కొందరు బ్రోకర్ లను, కోడెల సంప్రదించారట వారికి ఇవ్వాల్సిన కమీషన్ ఇచ్చి ఆ మూడు కోట్లను మార్పించి కొత్త నోట్లను తీసుకున్నారట.






అయితే, ఎప్పుడూ దోచుకోవటమే తప్ప ఇవ్వటం ఎరుగని కోడెల శివప్రసాదరావు తొలిసారిగ కమీషన్ ఇవ్వడంతో బ్యాంకర్ లు, బ్రోకర్ లు తీసుకున్నారు. పదిహేను రోజుల్లో మూడు కోట్ల రూపాయల మార్పిడి జరిగిపోయింది. ఇక కోడెల శివప్రసాదరావులోని అసలు వ్యక్తి బయటకు వచ్చాడు. తన దగ్గర కమిషన్ తీసుకున్న బ్యాంకర్ లు బ్రోకర్ లను పిలిపించి తీసుకున్న మొత్తం డబ్బు తిరిగి కట్టించుకున్నారట. వీరిలాగే కమీషన్ తీసుకొని నోట్లు మార్చుతున్న మిగతా బ్యాంకర్ లను కూడా పిలిపించి, మీ విషయం బయటపెట్టకుండా ఉండాలంటే నా వాటా నాకు ఇవ్వండని, వసూలు చేశారని సదరు కార్యకర్తలు చెబుతున్నారు.






ఇక కోడెల కుమార్తె విజయలక్ష్మి తండ్రిని మించిన కూతురిగా పేరు తెచ్చుకున్నారు. ఒక ఫంక్షన్ కు వెళ్లేందుకు నరసరావుపేటకు చెందిన జ్యూయలరీ షాపు ఓనర్ నుంచి సుమారు నలభై లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను తెప్పించుకున్నారట. ముందస్తు ఒప్పందం ప్రకారం ఆ ఫంక్షన్ కు వెళ్లొచ్చాక నగలన్నీ తిరిగి ఇచ్చేయాలి. కానీ తీసుకోవడమే తప్ప తిరిగి ఇవ్వటం ఎరుగని కోడెల శివప్రసాదరావు కుమార్తె కదా అందుకే నగల్ని ఇచ్చేది లేదని తేల్చి చెప్పిందట.దీంతో చేసేది లేక ఆ జ్యుయలరీ షాపు ఓనర్ కోడెల శివప్రసాదరావు దగ్గరకు వెళ్ళి కుమార్తె ఘనకార్యం గురించి చెప్పారట. దీనికి కోడెల స్పందిస్తూ మా పేరు చెప్పుకుని నువ్వు చాలా సంపాదించావులే వెళ్లు అన్నారట.







పైగా నా కూతురు నీ కూతురు లాంటిదేననీ నీ కూతురికి బంగారం పెట్టావనుకునీ వెళ్లిపో అన్నారట. ఇలా ఉంటుంది వారి దోపిడీ వ్యవహారం అంటూ మరో టిడిపి కార్యకర్త బయటపెట్టారు. కోడెల కుటుంబంపై ఇప్పటి వరకూ పధ్ధెనిమిది కేసులు నమోదయ్యాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బు గుంజి మోసం చేయడం దగ్గర నుంచి స్థలాల కబ్జా వరకూ అనేకం ఉన్నాయి ఇందులో. వీటన్నిటి నేపథ్యంలో కోడెల శివప్రసాదరావు పరువే కాదు తెలుగుదేశం పార్టీ పరువు కూడా గంగపాలయింది. పార్టీని అడ్డుపెట్టుకొని కోడెల కుటుంబం చేయని దారుణం లేకపోవటంతో ఆయన్ను పూర్తిగా పక్కనపెట్టేశారట.






కోడెల బాధితులు ఆ కుటుంబంపై 18 కేసులు పెట్టిన టిడిపి అధిష్టానం నుంచి ఒక్కరు మాట్లాడలేదు. పార్టీకి సంబంధించిన చిన్న కార్యకర్తకు ఇబ్బంది కలిగినా పోరాటం చేస్తానని ప్రకటనలు ఇస్తున్న అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ కోడెల విషయంలో నోరు మెదపటం లేదు. అంటే ఒక రకంగా టిడిపిలో కోడెల ఒంటరి అయినట్లే స్థానికంగా కోడెలపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఒక రకంగా తెలుగుదేశంపార్టీ ఆ కుటుంబాన్ని వెలివేసింది అని చెప్పుకుంటున్నారు. అందుకు కారణం కోడెలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కోడెలకు మద్దతిస్తే మరింత ప్రజా వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే అవసరమైతే కోడెలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారట.








ప్రస్తుతం పధ్ధెనిమిది కేసులు నమోదైన నేపథ్యంలో కోడెల శివప్రసాదరావు ఆయన కుమారుడు శివరామ్ కుమార్తె విజయలక్ష్మిలను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే పార్టీ పరువు పోతుందని అంతకంటే ముందే పార్టీ నుండి సస్పెండ్ చేస్తే తమకు సంబంధం వుండదనేది చంద్రబాబు లెక్క. నిన్న మొన్నటి దాకా అసెంబ్లీ సమావేశాలు జరగడం ఇప్పుడు చంద్రబాబే వైద్య చికిత్సల పేరుతో అమెరికా వెళ్లిపోవడంతో ఆ సస్పెన్షన్ వ్యవహారం తాత్కాలికంగా నిలిచిపోయిందని ఎన్టీఆర్ భవన్ లో చెవులు కొరుక్కుంటున్నారు.కోడెల శివప్రసాదరావు ఆయన కుటుంబాన్ని పచ్చపార్టీ వెలివేసే రోజు దగ్గర్లోనే ఉందనేది అమరావతి వర్గాల సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: