ఇదీ, తెలంగాణ సాయుధ పోరాటం పై పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్  షాకింగ్‌ పరిశోధన!!
చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన తెలంగాణ సాయుధ పోరాటంలోని ఒక అపూర్వ విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బయట పెట్టి, ఒక చర్చను లేవనెత్తారు. హైదరాబాద్‌ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో 1946-51 మధ్య జరిగిన సాయుధ పోరాటం చాలా ముఖ్యమైంది.


'తెలంగాణ రైతులు' జరిపిన ఈ పోరాటం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. ఇది తెలంగాణ సాయుధ పోరాటంగా ప్రసిద్ధికెక్కడంతో పాటు దేశ కమ్యూనిస్ట్‌ ఉద్యమ చరిత్రలో తొలి స్వతంత్ర ప్రతిపత్తి గల ఉద్యమంగా నిలిచింది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉద్యమాలు సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచినా... ఈ ఉద్యమం వాటికి పదిరెట్ల స్థాయిలో జరిగింది. ఇది శ్రమ దోపిడీ, వెట్టి చాకిరీలు వంటి సామాజిక దురాచారాలకు చరమగీతం పాడేందుకు ప్రజల నుంచి వచ్చిన పోరాట స్పందన.


భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్న కారణాలతో ఎన్నో రకాల సాయుధ రైతాంగ పోరాటాలు పుట్టుకొచ్చాయి. వీటిల్లో హైదరాబాద్‌ సంస్థానంలోని తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం చారిత్రాత్మకమైనది. కెనడాకు చెందిన విల్‌ఫ్రెడ్‌ కాంట్‌వెల్‌ స్మిత్‌ 1962లో 'ది మీనింగ్‌ అండ్‌ ఎండ్‌ ఆఫ్‌ రిలీజియస్‌' అనే పుస్తకాన్నిరాశారు. దానిలో ఆయన సాయుధ పోరాటం గురించి ప్రస్తావిస్తూ, చైనా తర్వాత ఆసియాలో మరెక్కడా ఇంత పెద్ద ఉద్యమం జరగలేదని పేర్కొన్నారు. చరిత్రలో ఈ విధంగా ఉండగా,


ఇటీవల పవన్ కళ్యాణ్  గారు ఒక సభలో మాట్లాడుతూ, తెలంగాణ సాయూధ పోరాటం ...సారా, గుడుంబా నిషేధించటం వలన ఆగిపోయిందంట. గిరిజనులు మళ్ళీ సారా కావాలని అడగటం వలన, సారా నిషేధం ఎత్తి వేశారట. అప్పుడు మళ్ళీ ఉద్యమం ఊపందుకుందట... ఇలా సాగింది, వారి ఉపన్యాసం. దీని పై తెలంగాణ బుద్ది జీవులు సోషల్‌ మీడియాలో కడిగేస్తున్నారు.

' ఇది నిజమా?... అంటే తెలంగాణ సాయుధ పోరాటం సారా దొరక్కపోతే ఆగిపోయేంత వీక్‌ గా ఉండెనా?
అంటే ఆ ఉద్యమ కారులంతా తాగుబోతులని ఈ పవన్‌ సారు అనుకుంటున్నడా?
లేక, గిరిజనులను ఏమన్నా ఎవరూ ఏమీ అనరని అనుకుంటున్నడా?
తెలంగాణ అన్నా గిరిజనులన్నాఎందుకంత చులకన సారుకు?
గిరిజన కల్చర్‌ లో సారా ఉంటుంది అంటున్నడా? ఏందీ సారు ఉద్దేశ్యం? ' అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ఇంటిని ముట్టడించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇంటి ముందు టీఆర్‌ఎస్‌ కార్య కర్తలు ధర్నా దిగడం సంచలనంగా మారింది. తెలంగాణ ఉద్యమకారులు, అమర వీరులు.. వారి త్యాగాలను పవన్‌ కళ్యాణ్‌ హేళ చేసేలా మాట్లాడారంటూ వారంతా ఆయన ఇంటి ముందు నిరసన చేపట్టారు. పవన్‌ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.
పవన్‌ సార్‌ మాట్లాడిన లింక్‌ ఇదిగో...https://youtu.be/ZUAbHfH6kvI

https://www.youtube.com/watch?v

https://www.youtube.com/watch?v


మరింత సమాచారం తెలుసుకోండి: