ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇజ్రాయిల్ కు వెళ్లిన విషయం తెలిసిందే. వ్యక్తిగత పర్యటన నిమిత్తం వెళ్ళిన ఆయన బిజీ బిజీగా ఉన్నారు. ఆదివారం సీఎం జగన్ అక్కడ ఉప్పునీటి శుద్ధి చేసే ప్లాంటును పరిశీలించారు. ఇజ్రాయిల్‌లోని హడేరా ప్లాంట్‌ ఉన్నతాధికారి రఫిషమీర్‌ సీఎం జగన్‌కు ఆహ్వానం పలికారు. డిశానిటేషన్‌ ప్లాంటును టెల్‌ అవివ్‌లో ఇండియన్‌ మిషన్‌ డిప్యూటీ చీఫ్‌ షేరింగ్‌ తో డిశానినేషన్‌ కేంద్రాన్ని సందర్శించారు.

ఉప్పు నీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ గురించి ఈ సందర్భంగా ప్లాంట్‌ అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఉప్పునీటిని తాగు నీరుగా మార్చే విధానం, ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవస్ధ, వ్యయంకు సంబంధిత అంశాలను స్ధానిక అధికార లు సీఎంకు వివరించారు. అక్కడ శుద్ధి చేసిన నీటిని సీఎం జగన్‌తో సహా అధికారులు రుచి చూశారు. వాటి నాణ్యతను తెలుసుకొని ప్రశంసించారు.

ఇజ్రాయిల్‌ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ అంతకుముందు అత్యధిక దిగుబడి సాధించే దిశగా ఆ దేశం రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ పద్దతులను అడిగి తెలుసుకున్నారు. ఇజ్రాయిల్‌ దేశంలో అనుసరిస్తున్న యాజమాన్య పద్దతులు, అధిక దిగుబడుల కోసం అమలు చేస్తున్న సాగు విధానాలను ఆయన పరిశీలించారు. అక్కడి పంటల వాతావరణ పరిస్ధితులపై రైతులతో ముచ్చటించి పలు విషయాలను తెలుసుకున్నారు. తన నాలుగు రోజుల పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి సోమవారం అమరావతికి రానున్నారు.

ఏపీ రాష్ర్టానికి ఎక్కువ సముద్ర తీరం ఉండటంతో తీర ప్రాంత వాసులు ఉప్పునీటినే వినియోగిస్తున్నారు. వారికి మంచినీరు అందించటానికి కూడా ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తూనే ఉంది. సీఎం జగన్ డిశానిటేషన్ ప్లాంట్ సందర్శించడం ద్వారా ఏపీలో ప్లాంట్లు ఏర్పాటు అయ్యే అవకాశముంది. దీంతో తీర ప్రాంతవాసులకే కాదు రాష్ర్టంలో త్రాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు కూడా మంచినీటిని తరలించే అవకాశముంది. దీనిపై సీఎం జగన్ ఏం ప్రకటన చేస్తారో వేచి చూడాలి....

మరింత సమాచారం తెలుసుకోండి: