స‌రిహ‌ద్దు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో క‌ల‌కలం చోటు చేసుకుంది. సోమ‌వారం అర్థరాత్రి తర్వాత పరిణామాలు మారిపోయాయి. పలు జిల్లాల్లో ఆంక్షల అమలుతో పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. కిష్టావర్, రాజౌరి, రాంబన్ జిల్లాల్లో రాత్రిపూట నుంచి కర్ఫ్యూ కొనసాగుతోంది. ముందు జాగ్రత్త చర్యలుగా భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలు మోహరించారు. రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమలు చేశారు. బహిరంగసభలు, ప్రదర్శనలకు అనుమతి నిరాకరించారు. జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కశ్మీర్ ఐజీ, గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.


కేంద్ర‌మంత్రి అమిత్‌షా స‌మావేశం త‌ర్వాత‌..మొత్తం సీన్ మారిపోయిన‌ట్లు తెలుస్తోంది. అర్ధ‌రాత్రి నుంచి విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేశారు. కశ్మీర్ లోయలో విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు సూచించారు. తదుపతి ఉత్తర్వులు వచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంచాయని అధికారులు వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో సమాచార, ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేశారు. మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను గృహనిర్బంధం చేశారు. కాంగ్రెస్ నేత ఉస్మాన్ మజీద్, సీపీఐ ఎమ్మెల్యే అరెస్టు చేశారు.


కశ్మీర్ లోయలో భద్రతా బలగాల మోహరింపును అధికారులు ముమ్మరం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో నిత్యావసర వస్తువులను ముందుగానే సమకూర్చుకుంటున్నారు. కిరాణా షాపులు, పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. మరోవైపు వివిధ విద్యాసంస్థలు కూడా తమ విద్యార్థులను హాస్టళ్లు ఖాళీ చేయాలని కోరాయి. గతవారం తరలించిన పారా మిలిటరీ బలగాలను శ్రీనగర్‌తోపాటు కశ్మీర్‌లోయలోని సున్నిత ప్రాంతాల్లో మోహరించినట్లు అధికారులు తెలిపారు. సచివాలయం, పోలీస్ హెడ్‌క్వార్టర్స్, ఎయిర్‌పోర్టుతోపాటు పలు కార్యాలయాల వద్ద భద్రతను పెంచినట్లు వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశమున్న ప్రాంతాల్లో అల్లర్ల నియంత్రిత వాహనాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న విద్యాసంస్థలను సోమవారం మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు రాష్ట్రంలోని ఉద్రిక్త పరిస్థితులపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత మాజీ ముఖ్యమంత్రులు మెహబూబాముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాతోపాటు పలువురు కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: