భారత దేశ ప్రజలకు మన దేశ ప్రథమ ప్రధాని ఇచ్చిన చేదు మాత్ర..అప్పటి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫిరెన్స్ నేత షేక్ అబ్దుల్లా, భారత ప్రధాని నెహ్రూ మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే ఈ ఆర్టికల్ 370. ముఖ్యంగా ప్రతి భారతీయుడు ఈ ఆర్టికల్ 370 అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆర్టికల్ 370లోని నిబంధనల ప్రకారం రక్షణ, విదేశాంగ విధానాలు, కమ్యూనికేషన్ అంశాల మినహా వేరే ఏ అంశానికి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా కేంద్రం జమ్ము-కశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో అశాంతి, హింస లాంటివి జరిగినప్పుడు రాష్ట్రపతి స్వయంగా అక్కడ అత్యవసర స్థితి విధించలేరు. రాష్ట్రం నుంచి దానికి సిఫారసు చేసినప్పుడు మాత్రమే ఆయన అలా చేయాల్సి ఉంటుంది. రాజ్యంగ సభ, కాంగ్రెస్ ప్రతినిధులను పటేల్ ఒప్పించారు. అంతకు ముందు ఆర్టికల్ 370 విషయంలో అనేక అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ.. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా, పటేల్ మాటను కాదనలేక ఆమోదం తెలిపారు. భారత దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్ కు ఈ ఆర్టికల్ 370 కల్పిస్తుంది. భారతదేశంలో అందరికీ ఒక పౌరసౌత్వం వుంటే...జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఈ ఆర్టికల్ 370 ద్వారా రెండు పౌరసౌత్వాలు కల్పించబడ్డాయి. ఈ ఆర్టికల్ తో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సెపరేట్ అజెండానే కాదు జెండా కూడా వుంది.

దేశంలో అన్ని రాష్ట్రాలకు 5 సంవత్సారాలకు ఎన్నికలు జరిగితే...ఇక్కడ ఆరు సంవత్సారాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.  ఆర్టికల్ 370 మూలంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత దేశ సార్వభౌమాదికారాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించినా ఎటువంటి నేరము కాదంట. సుప్రీంకోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పనిచేయవు. 


పార్లమెంటు చేసిన చట్టాలు ఇక్కడ కొన్ని ఏరియాలకే పరిమితం !
జమ్మూ కాశ్మీర్ లో వుండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది
అదే  పాకిస్థాన్ యువకుడిని పెళ్లిచేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరి పౌరసత్వం లభిస్తుంది. 
ఆర్టికల్ 370 మూలంగా , RTI చట్టాలు ఇక్కడ పనిచేయవు, RTE ఇక్కడ అప్లై చేయబడదు, కాగ్ కు ఇక్కడ తనిఖీలు చేసే అధికారం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: