చరిత్రలో ఆగస్టు 5వ తేదీ ప్రత్యేకతను సంతరించుకోబోతుంది. దేశంలో సంచలనం రేకెత్తిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై భిన్నవాదనలు వినవస్తున్నాయి. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఈ ఆర్టికల్ రద్దు కశ్మీర్ కు స్వేచ్ఛ కల్పించందనే చెప్పాలి. ఈ పరిణామ క్రమంలో గతంలో ఈరోజున జరిగిన విశేషాలను ఒక గుర్తు చేసుకుందాం..


సంఘటనలు..
1845: ఆస్ట్రేలియా లోని 'కింగ్ ఐలేండ్' ద్వీపానికి దగ్గరలో జరిగిన ఘోరమైన ఓడ (పేరు: కేటరక్వి) ప్రమాదంలో, 407 మంది మరణించారు.
1858: మొట్టమొదటి ట్రాన్స్ అట్లాంటిక్ టెలిగ్రఫ్ కేబుల్ లైను వేసారు.
1874: ఇంగ్లాండ్లో ఉన్న పోస్టల్ సేవింగ్స్ సిస్టంని ఆదర్శంగా తీసుకుని, జపాన్ తన సొంత పోస్టల్ సేవింగ్స్ సిస్టంని ప్రవేశపెట్టింది.
1879: రాత్రి సమయంలో మొట్టమొదటిసారిగా, ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో 'గ్యాస్ లైట్ల' వెలుతురులో క్రికెట్ ఆడారు.
1882: మార్షల్ లా (సైనిక దళాల న్యాయం), జపాన్లో  చట్టమయ్యింది.
1912: జపాన్ లోని టోక్యో నగరంలోని "గింజా" అనే చోట, మొట్టమొదటి సారిగా టాక్సి కేబ్ (అద్దె కారు- టాక్సీలు) లు ప్రారంభించారు.
1962: నెల్సన్ మండేలాని నిర్బంధించి, చెఱ (ర) సాలలో బంధించారు.
1963: ఆణ్వస్త్రాలు, భూమిలోపలే పరీక్షించాలి (వాతావరణంలో గాని, రోదసీలో గాని, నీటిలోపల గాని పరీక్షించకూడదు) అన్న మినహాయింపుతో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్ దేశాలు సంతకాలు చేసాయి
1963: అమెరికా, ప్రయోగించిన రోదసీ నౌక, మారినర్-7, మొట్టమొదటి సారి, కుజగ్రహం చిత్రాలను, ప్రసారంచేసింది.
1973: ఇద్దరు ఆరబ్ తీవ్రవాదులు, ఏథెన్స్ లోని విమానాశ్రయంలో గుంపుగా ఉన్న ప్రయాణీకుల మీద కాల్పులు జరపగా, ముగ్గురు మరణించగ, 55 మంది గాయపడ్డారు.
1984: జోన్ బెనోయిట్, స్త్రీల మొదటి ఒలింపిక్ మారథాన్ గెలుచుకున్నది.


జననాలు :
1896: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు. (మ.1990)
1862: జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (మరణం ఏప్రిల్ 11, 1890) .
1908: చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు. (మ.1975)
1930: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (మ.2012)
1974: కాజోల్, ప్రముఖ భారతీయ సినీ నటి.
1982: జెనీలియా, ప్రముఖ తెలుగు, హిందీ, తమిళం మరియు కన్నడ సినిమా నటి.


మరణాలు:
 
1895: ఫ్రెడరిక్ ఎంగెల్స్, జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. (జ.1820)
1950: గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (జ.1890)
1962: మార్లిన్ మన్రో, ప్రముఖ హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (జ.1926)
1991: సొయిఛిరో హోండా, హోండా కంపెనీ స్థాపకుడు., కాలేయ కేన్సర్ తో 84వ ఏట మరణించాడు (జ.1906)
1984: రిచర్డ్ బర్టన్, హాలీవుడ్ నటుడు, తన 58వ ఏట మరణించాడు (జ.1925 నవంబరు 10)
1997: బోడేపూడి వెంకటేశ్వరరావు, కమ్యునిష్టు నాయకుడు. (జ.1922).


మరింత సమాచారం తెలుసుకోండి: