ఆర్టికల్ 370 రద్దు చేయడంపై దేశంలో చాలా ప్రాంతాల్లో ఆనందోత్సాహాలు వెళ్లి విరిశాయి.  కాశ్మీర్ ఇండియాలో ఒక పార్ట్ గా ఉండాలని ఎప్పటి నుంచో కల కంటున్నారు.  కానీ, మొన్నటి వరకు సాధ్యం కాలేదు.  ఆర్టికల్ 370 అన్నది తాత్కాలికంగా ఏర్పాటు చేసిందే అయినప్పటికీ గత 60 ఏళ్లుగా ఈ ఆర్టికల్ ను రద్దు చేయడానికి ఎవరు సాహసం చేయలేదు.  60- ఏళ్లలో కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా అధికారంలో ఉన్నది.  ఆ సాయంలో కూడా ఈ ఆర్టికల్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు.  



కాగా, 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావించింది.  రాజ్యసభలో ఖచ్చితమైన మెజారిటీ ఉండటంతో ప్రభుత్వం ఈ రద్దు బిల్లును ప్రవేశపెట్టింది.  కాగా, ఈ రద్దుబిల్లును వివిధ పార్టీలు ఆమోదం తెలిపాయి.  దీనికి కారణం లేకపోలేదు.  ముందుగా తమిళనాడు విషయాన్ని తీసుకుంటే.. అన్న డీఎంకే ఈ బిల్లుకు మద్దతు తెలిపింది.  దీనికి కారణం ఉన్నది.  తమిళనాడులో ప్రభుత్వం చాలా వీక్ గా ఉన్నది.  ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉండాలి.  అలా ఉంటేనే మనుగడ ఉంటుంది.  పైగా కేంద్రం ఇప్పుడు డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటోంది.  తమిళనాడు విషయంలో అలాంటి డేరింగ్ నిర్ణయం తీసుకోకుండా ఉండాలి అంటే సఖ్యతగా ఉండాలి.  అప్పుడే మనుగడ ఉంటుంది.  



మరోవైపు వైకాపా కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చింది.  మిగతా పార్టీలకు ఏమోగానీ, వైకాపాకు మాత్రం కేంద్రం సపోర్ట్ చాలా అవసరం.  కేంద్రంతో సఖ్యతగా లేకుండా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ పాగావేయాలని చూస్తోంది.  ఇప్పుడు ఆర్టికల్ 370 కి మద్దతు తెలపకపోతే.. దానివలన భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశాం ఉన్నది.  పైగా ఇది జాతీయతకు సంబంధించిన అంశం కావడంతో వైకాపా మద్దతు తెలిపింది.  దీంతోపాటు, మోడీ, అమిత్ షాను ఆకాశానికి ఎత్తేసింది వైకాపా. 

మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపింది.  బీజేపీతో విడిపోయి పెద్ద తప్పు చేసింది.  మరలా అలాంటి తప్పు చేయకూడదు అనుకుంటే.. బీజేపీతో సఖ్యతగా ఉండాలి.  అప్పుడే ఫ్యూచర్ ఉంటుందని తెలుగుదేశం భావించి ఉండొచ్చు.  అయితే,ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఆప్, బిఎస్పీ పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతు పలకడం.  


మరింత సమాచారం తెలుసుకోండి: