ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు నరేంద్ర మోడీ ఒకే ఒక వారం వ్యవధిలో ముగించేశారు. కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35A రద్దు చేస్తూ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఇదే విషయం మీద అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడినారు. జమ్మూ కాశ్మీర్ మీద వేర్వేరుగా 4 బిల్లులను పాస్ చేయడం గమనార్హం. ఇక నుంచి జమ్మూ కాశ్మీర్, లడఖ్ రెండు వేరు వేరు కేంద్ర ప్రాంతాలుగా గుర్తింపు పడతాయి. దీనితో కాశ్మీర్ మీద ఏ నిర్ణయం తీసుకోవాలన్న .. కేంద్ర ప్రభుత్వం నేరుగా తీసుకోవచ్చు. ఇందులో ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావనే ఉండదని చెప్పాలి. దీనితో కాశ్మీర్ ఇప్పటి వరకు అనుభవిస్తున్న ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా.. ఇవన్నీ కోల్పోయినట్టు చెప్పాలి. 


అయితే కాశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ ప్రభుత్వాన్ని చాలా మంది సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ ఇక నుంచి కాశ్మీర్ కు ప్రత్యేక జెండా, రాజ్యాంగం, ద్వంద్వ పౌరసత్వం, ఇవేవి ఉండవని .. ఇక కాశ్మీర్ లో ఎవరైనా ఆస్తులు కొనుగోలు చేయొచ్చని .. జై హింద్ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక నిర్మాత ఎస్.కె.ఎన్ ట్వీట్ చేస్తూ ఇక  నుంచి కాశ్మీర్లో భారత్ జెండాను కించ పరిస్తే బ్యాండు బాజా వాయిస్తారని ట్వీట్ చేశారు. 


ఇక ఆర్టికల్ 370 రద్దు పై లావణ్య త్రిపాఠి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందని, నాకు చాలా గర్వంగా ఉందని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు. ఇలా చాలా మంది సినీ నటులు, నిర్మాతలు, హీరోయిన్స్ తమ ఆనందాన్ని సోషల్ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నారు. వీళ్ళే కాదు సగటు భారతీయుడు కూడా బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సోషల్ మీడియాలో జై హింద్ అంటూ నినాదాలతో దుమ్మురేగిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: