1947 ఇండియా.. పాక్ విడిపోయిన తరువాత జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగం అయ్యింది.  అయితే, అదే ఏడాది పాకిస్తాన్ కాశ్మీర్ లోని కొంతభాగాన్ని ఆక్రమించుకుంది.  అప్పటి నుంచి కాశ్మీర్ కు అదనంగా ఆర్టికల్ 370 ప్రవేశపెట్టింది.  1954 వ సంవత్సరంలో ఈ ఆర్టికల్ ను ప్రవేశపెట్టింది.  ఈ ఆర్టికల్ తాత్కాలికంగానే ఉండాలని అనుకున్నా.. రాజకీయ ఒత్తిడుల కారణంగా ఆర్టికల్ ను కంటిన్యూ చేస్తూ వస్తోంది.  ఆర్టికల్ 370 కారణంగా కేంద్రం నుంచి బెనిఫిట్స్ సామాన్య ప్రజలకు అందటం లేదని కేంద్రం వాదిస్తూ వస్తోంది.  అక్కడి యూత్ కు ఉద్యోగాల కల్పన విషయంలో కూడా అక్కడి ప్రభుత్వాలు అలసత్వం చూపించాయి. 


అభివృద్ధికి దూరంగా జమ్మూ కాశ్మీర్ ఉండటంతో.. ఆర్టికల్ 370 రద్దు చేసినట్టు కేంద్రప్రభుత్వం పేర్కొంది.  దీంతో పాటు జమ్మూ కాశ్మీర్ ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఇప్పటికే రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంది.  దీని ప్రకారం  జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో.. ఎలాంటి ఇండస్ట్రీలు అక్కడ ఏర్పాటు చేయాలో.. ఎలా అక్కడ ఉద్యోగాల కల్పనను తీసుకురావాలో కేంద్రం ఇప్పటికే సిద్ధం చేసుకున్నటుట్ తెలుస్తోంది.  కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఒక మార్గం దొరింది కాబట్టి.. ఇప్పుడు కేంద్రం చూపులు పీవోకే మీద ఉన్నట్టు తెలుస్తోంది.  


1947 లో పాక్ కాశ్మీర్ లోని కొంతభాగాన్ని ఆక్రమించుకుంది. ఆ తరువాత ఆ భాగం వివాదాస్పదంగా పాక్ లో భాగంగా ఉండిపోయింది.  ఇప్పటి వరకు ఆ ప్రాంతాన్ని తిరిగి ఇండియా తీసుకోలేదు. పీవోకే ను తిరిగి ఇండియాలో కలిపేసుకుంటే సంపూర్ణ కాశ్మీర్ ఇండియాలో భాగం అవుతుంది.  రాబోయే రోజుల్లో ఇది సాధ్యం అయ్యే అవకాశం ఉన్నది.  దీంతో పాటు ఇప్పుడు మరో వాదన వినిపిస్తోంది.  పాకిస్తాన్ లో ఒక భాగంగా ఉన్న బెలూచిస్తాన్ ప్రజలు స్వాతంత్రం కావాలని కోరుకుంటున్నారు. భారత్ తమకు మద్దతు ఇవ్వాలని, భారత్ మద్దతు ఇస్తే తాము స్వాతంత్రం కోసం పోరాటం చేస్తామని అంటున్నారు.  బెలూచిస్తాన్ ప్రజలకు సహాయం చేసేందుకు భారత్ కూడా సిద్ధంగా ఉన్నది.  బెలూచిస్తాన్ స్వాతంత్రం సంపాదించుకుంటే అఖండ భారత్ సాధనకు మరో అడుగు ముందుకు వేసినట్టే అవుతుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: