నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా మారుతున్న పాఠశాల బస్సులు


చోదకుల అతి వేగం, యాజమాన్యం నిర్లక్ష్యం కలగలసి పాఠశాల బస్సులను మృత్యు సేకటాలు గా మారుస్తున్నాయి. 

అభం శుభం తెలియని పసి పిల్ల్లలను పాఠశాలలకు తీసుకు వెళుతున్న బస్సుల తీరు చాలా ఆందోళనకరంగా వున్నది. నడపడానికి అనువుగా లేని పరిస్థితిలో వున్న బస్సులు లెక్కకు మిక్కిలి గా చెప్పవచ్చు. ప్రతీ రోజు ఎదో ఒక చోట పాఠశాలలకు పిల్లలను తీసుకువెళుతున్న బస్సులు ప్రమాదమునకు గురి అవ్వడం మనం చూస్తూనే ఉంటాము.   

నేడు వాహనాన్నినిర్లక్ష్యంగా, అతి వేగంగా నడపడం చాలా మాములు విషయం గా మారిపోయింది.

లైసెన్స్ లేకుండా వాహనం నడిపే డ్రైవర్లు కొందరైతే, మద్యం మత్తులో వాహనం నడిపే డ్రైవర్లు మరికొందరు.  నీకిలీ లైసెన్స్ తో వాహనం నడిపేవారు ఇంకొందరు.  15 సంవత్సారములు నిండిన వాహనములు చాలా పాఠశాలల లో వున్నాయన్న విషయం అందరికి తెల్సిందే.

ఈ ప్రమాదములను నివారించుటకు సరియయిన చర్యలు తీసుకునే వారు కరువైయ్యారు.  అభం శుభం తెలియని పసి పిల్ల్లల ప్రాణాలు గాలి లో కలసి పోతున్న పట్టించుకునే నాధుడు లేడు.
ఎదో ఒక విషాద సంఘటన జరిగితే తప్ప నిద్దుర లేవని సంబంధిత వర్గాలు, ఎప్పుడు కంటితుడుపు చేర్యాల తో కాలం వెళ్ళబుచ్చడం తప్ప శాశ్వత నివారణ చర్యలు ఎవ్వరూ తీసుకోవటం లేదని చెప్పవచ్చు.


వీరందరి నిర్వాకం ఫలితంగా అంతులేని వేదన అనుభవించేవారు మాత్రం తమ పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులే.  పసి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ఈ రకం క్రీడ వెంటనే ఆపెయ్యాలి.  ప్రతీ పాఠశాల యాజమన్యం వెంటనే తమ బస్సులను తనిఖీ చేయించి, అవసరమైతే మరమ్మత్తులు కూడా చేయించిన తరువాత నే బస్సును బయటకు పంపాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: