సుష్మాస్వ‌రాజ్..భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో అగ్రగణ్యురాలు. ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖుల్లో సుష్మా స్వరాజ్‌ ముందు వరుసలో ఉంటారు. ఆపదలో ఉండి సాయం కోరే వారి విషయంలో తక్షణమే స్పందించే సుష్మా స్వరాజ్‌కు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు.  


సుష్మాస్వరాజ్ వ్య‌క్తిగ‌త వివ‌రాలివి....1952, ఫిబ్రవరి 14న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు. 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996, 98లలో వాజపేయి మంత్రివర్గంలలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితుల‌య్యారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమె పోటీ చేయ‌లేదు.


తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో 11 సార్లు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో పోరాడిన సుష్మా బలమైన పోటీని, ప్రత్యర్థులతో తలపడటాన్ని ఆమె ఎన్నడూ తప్పించుకోలేదు. తాను కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్నానని ట్విట్టర్‌లో స్వయంగా ప్రకటించడం ద్వారా సుష్మా భారత రాజకీయ నాయకులు ప్రజా జీవితంపై కొనసాగుతున్న ముసుగును బద్దలు చేసి పడేశారు. తర్వాత ఆమె వేగంగా కోలుకున్నారని భావించిన ద‌శ‌లో..దుర‌దృష్ట‌వ‌శాత్తు క‌న్నుమూశారు. గత ప్రభుత్వ కేంద్ర విదేశాంగ బాధ్యతలు నిర్వహించిన సుష్మా స్వరాజ్‌ విధిశ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. సుష్మా ఢిల్లీకి సీఎంగా గతంలో పనిచేశారు. కాగా త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు సుష్మాపేరును పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: