కాశ్మీర్ విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలతో పాటు బీజేపీని వ్యతిరేకించే కేజ్రీవాల్, మాయావతి, చివరకి టీడీపీ కూడా సపోర్ట్ చేసింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు చివరికి ఆ పార్టీకి బ్యాక్ ఫైర్ అయ్యే పరిస్థితి వచ్చింది. నిజానికి కాశ్మీర్ విషయంలో బీజేపీ నిర్ణయం తప్పు అని మెజారిటీ ప్రజల నుంచి వ్యక్తం కావటం లేదు. అలాంటప్పుడు కాంగ్రెస్ అనవసర రగడ చేయడం వల్ల ఆ పార్టీ ప్రతిష్ట మసగబారే అవకాశం ఉంది. ఇప్పటీకే ఆ పార్టీ ఘోర పరిస్థితిలో ఉంది. మోడీ తన వ్యూహ చాతుర్యంతో దేశాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. ఇలాంటప్పడు ఇంకా కాంగ్రెస్ పస లేని వాదనతో పార్లమెంట్ లో ఉన్న పరువును పోగొట్టుకుంటుంది. 


నిజానికి  కాశ్మీర్ పరిస్థితి ఇప్పటికి ఇలా ఉగ్రవాద మూకలతో ఉందంటే 70 ఏళ్ల క్రితం నెహ్రూ చేసిన ఒప్పందం. లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో కాశ్మీర్ కూడా ప్రశాంతంగా ఉండేది. లేని పోనీ ప్రత్యేక అధికారాలు జమ్మూ కాశ్మీర్ కు కట్టబెట్టి దానిని ఇండియాలో పాక్షికంగా అంతర్భాగం అయ్యే విధంగా చేశారు. దీనితో కాశ్మీర్ ప్రజలు మిగతా భారత దేశపు ప్రజలతో మమేకం కాలేక పోయారు. దీనితో కాశ్మీర్ లోకి ఉగ్రవాదులు చొరబాటు సింపుల్ అయ్యింది. అయితే బీజేపీ పార్టీ ఎట్టకేలకు ధైర్యం చేసి కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి అధికారాలను రద్దు చేసింది. కానీ ఇవి కూడా కాంగ్రెస్ కు నచ్చడం లేదు. 


స్వంతంత్ర భారతంలో కాశ్మీర్ విషయంలో ఏ ప్రభుత్వం తీసుకోని నిర్ణయం తీసుకున్నది. దీని ద్వారా 70 ఏళ్ల క్రితం జరిగిన ఒప్పందానికి స్వస్థి పలికినట్లైంది. అమిత్ షా పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశ పెట్టగానే విపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేసిందని ఆరోపించారు. అయితే దేశంలో మెజారిటీ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: