బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా, మంచి మనసున్న నాయకురాలిగా కేంద్ర మాజీమంత్రి సుష్మాస్వరాజ్ ప్రజలకు దగ్గరయ్యారు. మంగళవారం గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. లాయర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనంతరం రాజకీయాల్లో చేరి అనతికాలంలోనే దేశరాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సుష్మా. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.


ప్రజా ఉద్యమంగా మారిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి భాజపా జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన కృషి వెలకట్టలేనివని కరీంనగర్‌ భాజపా ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన సుష్మా స్వరాజ్  కన్నుమూయడంతో... తమ ఆత్మీయురాలిని పోగొట్టుకున్నామన్న బాధ ప్రతి తెలంగాణ పౌరుడు మదిలో ఉందన్నారు. సామాన్య తెలంగాణ పౌరుడి  మనోవేదనను ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా మలిచిన ధన్యురాలు సుష్మా స్వరాజ్ అని బండి సంజయ్ పేర్కొన్నారు. తమ ఇంటి ఆడపడుచు మరణం తీరనిదని, తెలంగాణ రాష్ట్రానికి గవర్నగా వస్తుందన్న ఎదురుచూపులకు భాగ్యం లేకుండా పోయిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సుష్మా స్వరాజ్ మృతి పట్ల బండి సంజయ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె అనుసరించిన సైద్ధాంతిక ఆలోచనా ధోరణిలో తెలంగాణ ప్రజలు పయనించడమే ఆమెకు తెలంగాణ ప్రజలు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు.


సుష్మాస్వరాజ్ బాల్యం, విద్యాభ్యాసం, కళాశాల విద్య వరకు అంబాలాలోనే జరిగింది. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్‌ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1970లలో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు.1975లో సుష్మాస్వరాజ్ వృత్తిరీత్యా న్యాయవాది అయిన స్వరాజ్ కౌశల్‌ను వివాహంచేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉన్నారు. భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మిజోరాం గవర్నర్‌గా పనిచేశారు. బరోడా బాంబు పేలుళ్ళ కేసులో జార్జి ఫెర్నాండేజ్ తరఫున వాదించి గెలిపించారు.

1977లో జనతా పార్టీ తరఫున హరియాణా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవిని నిర్వహించి మళ్ళీ 1987లో రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ తరఫున హరియాణా విధానసభకు ఎన్నికయ్యారు. 1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రిగా పనిచేశారు.1984లో సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోకదళ్-భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం, పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించారు.


రాజ్యసభ సభ్యురాలిగా 2004 ఏప్రిల్‌లో సుష్మాస్వరాజ్ ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. జనవరి 2003 నుంచి మే 2004 వరకు మరో రెండూ శాఖలు (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాలు) అదనంగా చేపట్టారు. 2006 ఏప్రిల్లో మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ రాజ్యసభకు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతున్నారు.


1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు. అంతకుముందు 1980, 1984, 1989లలో కార్నాల్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందారు.1996లో దక్షిణ దిల్లీ నియోజకవర్గం నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజపేయీ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.


1998లో 12వ లోక్‌సభకు మళ్లీ  రెండో సారి దక్షిణ దిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వాజపేయీ రెండో మంత్రివర్గంలో మళ్లీ అదే శాఖకు మంత్రిగా పనిచేశారు. మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యునికేషన్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. దిల్లీ శాసనసభ ఎన్నికల్లో  విజయం సాధించడానికి 1998 అక్టోబరులో భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం సుష్మాస్వరాజ్‌ను రంగంలో దింపింది. ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో సుష్మా దిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. దిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.



బళ్ళారిలో సోనియాగాంధీపై పోటీ 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. సోనియాగాంధీపై పోటీకి భారతీయ జనతా పార్టీ తరఫున సుష్మాస్వరాజ్‌ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ ఓడిపోయినప్పటికీ.. సోనియాపై పోటీచేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు సుష్మాజీ.


ప్రజా ఉద్యమంగా మారిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి భాజపా జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన కృషి వెలకట్టలేనివని కరీంనగర్‌ భాజపా ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన సుష్మా స్వరాజ్  కన్నుమూయడంతో... తమ ఆత్మీయురాలిని పోగొట్టుకున్నామన్న బాధ ప్రతి తెలంగాణ పౌరుడు మదిలో ఉందన్నారు. సామాన్య తెలంగాణ పౌరుడి  మనోవేదనను ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా మలిచిన ధన్యురాలు సుష్మా స్వరాజ్ అని బండి సంజయ్ పేర్కొన్నారు. తమ ఇంటి ఆడపడుచు మరణం తీరనిదని, తెలంగాణ రాష్ట్రానికి గవర్నగా వస్తుందన్న ఎదురుచూపులకు భాగ్యం లేకుండా పోయిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సుష్మా స్వరాజ్ మృతి పట్ల బండి సంజయ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె అనుసరించిన సైద్ధాంతిక ఆలోచనా ధోరణిలో తెలంగాణ ప్రజలు పయనించడమే ఆమెకు తెలంగాణ ప్రజలు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు.


సుష్మా జీ సోషల్‌ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో తెలిసిందే. ఆపదలో ఉన్నామని ట్విటర్‌ వేదికగా ఆమెను ఆశ్రయించిన వారికి ఆపన్న హస్తం అందించేవారు. అందుకే ఆమెను అభిమానులు ‘ట్విటర్‌ క్వీన్‌’ అని ముద్దుగా పిలుచుకునే వారు. 2017లో ఓ నెటిజన్ తాను మార్స్‌లో చిక్కుకుని పోయానని సరదాగా ట్వీట్‌ చేశాడు. ఇందుకు సుష్మ కూడా ఏ మాత్రం తగ్గకుండా ‘మీరు మార్స్‌లో చిక్కుకున్నా సరే..అక్కడ మీకు సాయం చేయడానికి ఇండియన్‌ ఎంబసీ సిద్ధంగా ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారు. దీంతో సుష్మ హాస్య చతురతను ప్రశంసిస్తూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపించారు.



ఆమె హఠాన్మరణం చెందిన సందర్భంగా ఈ ట్వీట్‌ను గుర్తు చేస్తూ ఆమెకు కొందరు నెటిజన్లు నివాళులర్పించారు.
విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె సేవలు చిరస్మరణీయం. వీసా, పాస్‌పోర్టులు పోగొట్టుకున్న ఎంతో మందికి ఆమె స్వయంగా రంగంలోకి దిగి సాయం చేశారు. ఆమెలో హస్య చతురత కూడా ఎక్కువే. ట్వీట్లకు తనదైన శైలిలో సమయస్ఫూర్తితో స్పందించేవారు. కొన్నాళ్ల క్రితం ఓ నెటిజన్ ఆమెను సాయం కోరుతూ సరదా ట్వీట్‌ చేశారు. అందుకు సుష్మ ఇచ్చిన రిప్లై అమెలోని ప్రత్యేకతను చాటి చెప్పింది. ఆమె మృతితో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. 

 








మరింత సమాచారం తెలుసుకోండి: