ఏపీలో భారీ మెజారిటీతో జగన్ సీఎం అయిన సంగతీ తెలిసిందే. అయితే చంద్రబాబుకు మిత్రుడిగా ముద్ర పడిన వెంకయ్య జగన్ కు శుభాకాంక్షలు కూడా చెప్పారు. పైగా ఆంధ్ర రాష్ట్రానికి ఏ సహాయం కావాలన్నా తాను చేయడానికి సిద్ధమని, జగన్ కు అండగా ఉంటానని ట్విట్టర్లో చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఇప్పటీకే చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి, చాలా మంది ప్రముఖలు కలిశాడు. పీఎంతో సహా .. అమిత్ షా ను కూడా కలిశారు. కానీ మన తెలుగు రాష్ట్రం నుంచి ఉప రాష్ట్ర పతి హోదాలో ఉన్న వెంకయ్యను మాత్రం కలవలేదు. అయితే అప్పట్లో వెంకయ్య కూడా జగన్ తో భేటీ సిద్దమే అయినప్పటికీ జగన్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీనితో కావాలనే జగన్ వెంకయ్య ను పక్కన పెట్టారని కొంత మంది విశ్లేశించారు. 


అయితే వెంకయ్య నాయుడు నీతులు చెప్పడమే గాని తాము పాటించం అనే సామెత ఉంది. ఈ సామెత ఖచ్చితంగా మన వెంకయ్య నాయుడుకి సరిపోతుంది. ఎక్కడికెళ్లినా, ఏ సభలో మాట్లాడినా ఈయన మాట్లాడే నీతి వాక్యాలు వినసొంపుగా ఉంటాయి. కానీ అయన మాత్రం వాటిని పాటించడు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం చేసిన వారిలో వెంకయ్యకు కూడా భాగస్వామ్యం ఉంది. ఎప్పుడు స్వంత ఊరు, మాతృ రాష్ట్రం అనే చెప్పే వెంకయ్య కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి న్యాయం చేయకుండా మౌనం వహించారు.


రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి హోదాలో ఏపీకి వెంకయ్య నాయుడు చేసిన అభివృద్ధి నామమాత్రమని చెప్పాలి. పైగా అప్పట్లో వెంకయ్య,చంద్రబాబు కలిసి జగన్ ను తొక్కేయాలని చూశారని ఒక టాక్ కూడా నడిచింది. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న జగన్ .. వెంకయ్య ను కలవకుండా ఇన్ని రోజులు లైట్ తీసుకున్నారు. అయితే ఎట్టకేలకు నిన్న జగన్ .. వెంకయ్య ను కలిశారు. కలిసి గౌరవంగా శాలువా కప్పి మర్యాదపూర్వకంగా మాట్లాడి వచ్చాడు. దీనితో జగన్ విషయంలో వెంకయ్య బాధ తీరిపోయినట్టేనని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: