కృష్ణా జిల్లా టీడీపీలో జంపింగ్ జపాంగ్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో అలజడి రేపుతోంది. అయితే  టీడీపీకి తొలి నుంచి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో ఈసారి విజయవాడ తూర్పు, గన్నవరం రెండుచోట్ల మాత్రమే ఆ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి నుంచి తేరుకుని ముందుకు వెళ్లాలని అధినాయకత్వం సిద్ధమవుతున్నవేళ ఓడిన నేతలు, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా సైకిల్ దిగాలని చూస్తున్నారంటూ సాగుతున్న ప్రచారం ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది.

 

ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా కుదిరితే వైసీపీ, వీలైతే బీజేపీ అన్నట్టుగా ఉన్నారని రాజకీయ విశ్లేషకుల్లో విస్తృత ప్రచారం సాగుతోంది. కాగా, ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో బోండా ఉమ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అంతేగాక, నాటి నుంచి కూడా బోండా ఉమా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో బోండా ఉమ పార్టీ మారడం ఖాయమని రాయకీయ వర్గాలు చెబుతున్నాయి.

 

మరోపక్క విజయవాడ ఎంపీ కేశినేని నానితో బోండా ఉమ సన్నిహితంగా ఉంటున్నారు. కేశినేని నాని బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి జరుగుతుంది. అలాగే సుజనా చౌదరితోను బోండా ఉమ  టచ్ లో ఉన్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. దీంతో వైసీపీకో, బీజేపీకో బోండా ఉమ జై కొట్టడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: