దేశం మొత్తం ఆర్టికల్ 370 ని  కేంద్రం రద్దు చేసిన ఆనందం లో ఉంటే మన దాయాది దేశం పాకిస్థాన్ మాత్రం కక్కలేక మింగలేక చాలా ఇబ్బంది పడతోంది.  ప్రధాని మోడీ నిర్ణయం పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది మోడీ సర్కార్ తీసుకున్న చర్యలు దుర్మార్గమని భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటోందని కాశ్మీర్ బలవంతం గా విలీనం చేసుకుందని ఆరోపిస్తోంది.  అంతేగాక కాశ్మీర్ రాష్ట్రం హక్కూలను భారత్  హరిస్తోందని సామాజిక మాధ్యమం ట్విటర్ లో పేర్కొంది.


పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి కార్యాలయంలో ఎన్ఎస్సి సమావేశానికి అధ్యక్షత వహించారు. భారత ప్రభుత్వం ఏకపక్ష మరియు చట్టవిరుద్ధమైన చర్యల వల్ల తలెత్తే పరిస్థితి, భారతీయ ఆక్రమిత కాష్మీర్  లో ఉన్న పరిస్థితిని కమిటీ చర్చించింది.  ఇమ్రాన్ ఖాన్, షా మెహమూద్ ఖురేషి, ఫిర్దాస్ ఆషిక్ అవన్  తదతర ముఖ్య నాయకులు ఈ‌ సమావేశల్లో పాల్గొన్నారు.


 అంతేకాక కాశ్మీర్ పరిణామాలను అన్నీ పరిశీలించిన తర్వాత పాకిస్తాన్ వాఘా సరిహద్దుల మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తొంది. ఈ ఐదు నిర్ణయాలను తమ ట్విటర్ ఖాతా లో‌ పెర్కొన్నారు.


1-భారత్‌తో దౌత్య సంబంధాలను తగ్గించడం.
2-భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయడం.
3-ద్వైపాక్షిక ఏర్పాట్ల సమీక్ష.
4-భద్రతా మండలితో సహా ఐరాసకు తీసుకెళ్లాలి.
5-ధైర్యంగా సంఘీభావంగా ఆగస్టు 14 పాటించాలి


మరింత సమాచారం తెలుసుకోండి: