పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో క్వెట్టా.. అక్కడ తాలిబన్ లు ఓసారి స్కూల్ పై దాడి చేశారు.  ఆ దాడిలో మలాలా గాయపడింది.  ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంది.  అప్పటి నుంచి తాలిబన్ లకు వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలుపెట్టింది.   మహిళల రక్షణ కోసం మలాలా ఓ సంస్థను స్థాపించి సేవచేయడం మొదలుపెట్టింది. 



ఆమె సేవలకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి లభించింది.  ఐక్యరాజ్యసమితిలో ఆమె చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.  అయితే, ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన తరువాత మలాలా కొన్ని కీలక విషయాలను గురించి మాట్లాడింది. గత 70 ఏళ్లుగా కాశ్మీర్ లో సంక్షోభంలో ఉన్నది.  మహిళలు, పిల్లలు నరకాన్ని అనుభవించారు. 


మహిళలపై ఎన్నో సంఘటనలు జరిగాయి.  వీరందరి భాద్యతను దక్షిణాసియా దేశాలు చూసుకోవాలి.  కాశ్మీర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్నది.. దక్షిణాసియా సొంతిల్లు లాంటిది.  అక్కడి ప్రజలగురించి కేర్ తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది.  దక్షిణాసియాలో 1.8 బిలియన్ ప్రజలు నివసిస్తున్నారు.  భిన్న జాతులు, భిన్నమైన భాషలు, భిన్న సంస్కృతులు అయినా అంతా దక్షిణాసియా ప్రజలే.   పరస్పరం హింసతో బతకాల్సిన అవసరం లేదు.  కాశ్మీర్ లో మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడ్డారు పడుతున్నారు.  వారి జాగ్రత్తను గురించి ఆలోచిస్తున్నా.. అధికారులు స్పందించి వారిని జాగ్రత్తగా చూసుకొనే విధంగా చట్టాలు చేయాలి అని చెప్పి మలాలా చెప్పింది.  



మలాలా మాటలను బట్టి చూస్తుంటే.. ఆమె ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. ఆ విషయాన్ని సూటిగా చెప్పడం లేదు.  పాకిస్తాన్ జాతీయురాలు కావడం కావొచ్చు.  జమ్మూ కాశ్మీర్ ను విభజించడం నచ్చకపోవచ్చు.  మాట్లాడిన మాట్లల్లో కొంత రద్దుకు అనుకూలంగా ఉన్నట్టుగానే కనిపించింది.  మలాలా మాటలు చూస్తుంటే కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్నట్టుగా ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: