ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన తరువాత పాకిస్తాన్ ఇండియాపై గుర్రుగా ఉన్నది.  ఇండియాను ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తోంది. ఇందుకోసం మార్గాలు అన్వేషిస్తోంది.  నిన్న అత్యవసరంగా సమావేశం జరిపి ఇండియాపై కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది.  దీంతో పాటు ఐక్యరాజ్య సమితిలో దీని గురించి కంప్లైంట్ చేయాలని అనుకుంటోంది.  అయితే, దీనికి ఇండియా ఏ మాత్రం భయపడలేదు.  అంతర్జాతీయంగా పాక్ గురించి తెలుసు.  



పాక్ లో 40వేలమంది ఉగ్రవాదులు ఉన్నారని స్వయంగా పాకిస్తాన్ ఇటీవలే ఒప్పుకుంది.  అంతర్గతంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. కాశ్మీర్ ను విభజించడంతో గగ్గోలు పెడుతోంది.  ఇండియా హైకమిషనర్ బహిష్కరణ నిర్ణయం చూస్తుంటే పాక్ ఇండియాతో తెగతెంపులు చేసుకోవాలని చూస్తున్నట్టు అర్ధం అవుతున్నది.  



పాక్ ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకు తీసుకెళ్లింది.  దీనిపై ట్రంప్ స్పందించారు.  ఇండియా విషయంలో దూకుడు తగ్గించాలని, కాశ్మీర్ అంశం ఇండియా అంతర్గత విషయం అని, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ఆపాలని, పాక్ నుంచి ఇండియాలోకి ఉగ్రవాదాన్ని చేరవేసే విధానానికి ఇప్పటికైనా స్వస్తి పలకాలని హెచ్చరించారు.  



ఈ హెచ్చరికతో పాక్ అయోమయంలో పడింది. ఇండియా విషయంలో పాన్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అన్నది ప్రశ్నర్ధకంగా మారింది.  ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి.  ఇప్పుడిప్పుడే శాంతి పవనాలు వీస్తున్నాయి.  మరికొన్ని రోజుల్లో నార్మల్ స్థితికి పరిస్థితులు వస్తాయని తెలుస్తోంది.   త్వరలోనే జమ్మూ కాశ్మీర్ లో హోమ్ శాఖా మంత్రి అమిత్ షా పర్యటించబోతున్నారు. 

అక్కడి ప్రజలకు మనోధైర్యాన్ని నింపబోతున్నారు. ఇప్పటికే అక్కడ జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటె, లష్కరే తోయిబా సంస్థ ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలియడంతో, ఐబి హెచ్చరికలు జారీ చేసింది.  ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: