ఆర్టికల్ 370  రద్దుతో రోజు రోజుకు ఒక్కోక్క అంశం వెలుగులోకి వస్తోంది. భారత్ పాక్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. పంతొమ్మిది వందల డెబ్బై ఆర వ సంవత్సరం లో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్ ప్రెస్ భారత్ పాకిస్థాన్ మధ్య రాకపోకలను సాగిస్తోంది.



ఫ్రెండ్ షిప్ ఎక్స్ ప్రెస్ గా పిలిచే ఈ రైలు ప్రతి బుధ ఆదివారాలలో ఢిల్లీ అట్టారీ,  పాకిస్థాన్ లోని లాహోర్ స్టేషన్ ల మధ్య నడుస్తోంది. ఆర్టికల్ 370  రద్దుకు నిరసనగా పాకిస్థాన్ ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటోంది. భారత్ తో వాణిజ్యాన్ని రద్దుచేసుకుంటున్నామని ప్రకటించిన కొద్ది సమయంలోనే రెండు దేశాల మధ్య వారధిగా ఉన్న సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను నిలిపివేసింది.



రైల్ ను శాశ్వతంగా నిలిపేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అట్టారీ సరిహద్దులోని అంతర్జాతీయ రైల్వే స్టేషన్ లో చాలా మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను శాశ్వతంగా నిలిపివేసినట్టు పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వెల్లడించారు. ఇప్పటికే టికెట్లు కొన్న వ్యక్తులు తమ డబ్బును లాహోరు డీ ఎస్ కార్యాలయం నుంచి తిరిగి పొందవచ్చని తెలియజేశారు.



భద్రతా కారణాల రీత్యా ఈ చర్యలను  తీసుకున్నామని పాకిస్థాన్ చెప్తున్నారు. అలాగే పాకిస్థాన్ సినిమా హాళ్లలో మన సినిమాల ప్రదర్శనను కూడా నిలిపివేస్తున్నట్టు పాకిస్థాన్ ప్రధాని స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ ఫిర్దౌస్ అశ్విన్ ప్రకటించారు. అయితే రైలును తిరిగి భారత్ కు పంపించాల్సిన బాధ్యత పొరుగు దేశం పాక్ దేనని అట్టారీ రైల్వే స్టేషన్ సూపరిండెంట్ అరవింద్ కుమార్ తెలిపారు. వీసా ఉన్న డ్రైవర్ ఇతర సిబ్బందిని పంపి రైలును తిరిగి భారతదేశానికి తీసుకెళ్లాల్సిందిగా పాక్ తెలిపినట్టు ఆయన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: