బీజేపీ కాశ్మీర్ పై తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం సరైంది కాదని కాంగ్రెస్ మరియు వామపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి భారత దేశ అభివృద్ధికి నిర్మాణాత్మక పాత్ర పోషించిన కాంగ్రెస్ మరియు వామపక్షాలు ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వంతో నడవకుండా చారిత్రాత్మక తప్పిదం  చేస్తుండడంతో వారిని పాకిస్తాన్ పేపర్స్ కవర్ పేజీల మీద హీరోలను చేస్తూ మన దేశం పై మరింత విషాన్ని అక్కడ ప్రజల గుండెలో నింపుతున్నారు.కాని వాటిని బీజేపీ పట్టించుకోకుండా తమ నెక్స్ట్ టార్గెట్ అయిన పివోకే పై కార్యాచరణ రూపొందించడంలో నిమగ్నమయ్యారు.

కాంగ్రెస్, వామపక్షాల వైఖరి తప్పు అని సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా ఈరోజు కాశ్మీరులో ఒక చర్య జరిగింది.మరి దీన్ని అయినా చూసి కాంగ్రెస్ మరియు వామపక్షాలు తమ వైఖరిని మార్చుకుంటాయో లేదో చూడాలి.370 అధికరణ రద్దుతో భారత్ సైన్యం కాశ్మీర్ లోయ అంతా ఉగ్రవాదులు కోసం మరియు వేర్పాటువాదుల కోసం జల్లెడ పడుతుంది. ఆ సమయంలో సైన్యం 70 మంది ఉగ్రవాదులని గుర్తించి వారిని అదుపులోకి తీసుకుందని ఆ పై వారిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయంతో అక్కడి నుండి తరిలించినట్టు సమాచారం.

కాశ్మీరీ ప్రజల మనసులను గెలవాలని వారు ఒప్పుకున్నాకే 370 అధికరణను రద్దు చేయాలని వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్న కాంగ్రెస్ మరియు వామపక్షాలు గత ఆరు నెలలుగా కాశ్మీర్ లోయలో దొరుకుతున్న ఉగ్రవాదుల సంఖ్యను చూసి అక్కడ నివాసం ఉంటున్న వారు ఎందుకు ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే పరిస్థితి ఎందుకు ఏర్పడిందో విశ్లేషించుకోవాలి. అలాగే అక్కడ వేర్పాటు వాద నాయకులను వెనకేసుకొస్తున్న ఆ రెండు పార్టీలు భారత్ ప్రభుత్వం గత 70 ఏళ్లుగా ఇచ్చిన నిధులకు అక్కడ ఎందుకు అభివృద్ధి జరగలేదో అక్కడి నాయకులతో పాటు సమాధానం చెప్పాలి.మరి ఆ రెండు పార్టీలు అనుసరిస్తున్న విధానానికి ప్రజలు ఎటువంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: