భారత ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక ప్రతి పత్తిని రద్దు చేశారు. కాశ్మీర్ ను రెండు ముక్కలుగా విడగొట్టి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం ఆధీనంలోకి తెచ్చారు. హోమ్ మంత్రి అమిత్ షా తో కలిసి జాగ్రత్తగా కాశ్మీర్ విభజనను అమలు పరిచారు. అయితే కాశ్మీర్ విభజన పూర్తి అయిన తరువాత మోడీ మన్ కీ బాత్ లో జాతినుద్దేశించి ప్రసంగించారు. మోడీ మాట్లాడుతూ కాశ్మీర్ లో నవశఖం ఆరంభం అయ్యిందని కాశ్మీర్ ప్రజల జీవన స్థితి గతులు మారతాయని మోడీ చెప్పుకొచ్చారు. బాగా ఆలోచించి కాశ్మీర్ విభజన నిర్ణయం తీసుకున్నామని, కాశ్మీర్ విభజన వల్ల నష్టపోయేది ఆ మూడు కుటుంబాలేనని .. వారు మాత్రమే భాద పడుతున్నారని మిగతా ప్రజలు సంతోషముగా ఉన్నారని మోడీ ప్రసంగించారు. 


కాశ్మీర్ ను విభజించి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చామని, ఇక కాశ్మీర్ మిగతా రాష్ట్రాలతో పాటు కలిసిపోతుందని, అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పాటు కాశ్మీర్ కూడా పోటీ పడుతుందని చెప్పారు. కాశ్మీర్ యువతకు ఉద్యోగ కల్పనలో పెద్ద పీట వేస్తామని, కాశ్మీర్ ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచుతామని మోడీ చెప్పారు. కాశ్మీర్ లో 45 వేల మంది అమాయకులు చనిపోయారని, ఇక కాశ్మీర్ లో అభివృద్ధి తప్ప హింస జరగదని చెప్పారు. 


ఇక కాశ్మీర్లో వ్యాపారం మెరుగవుతుందని, కాశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతుందని .. ప్రధాన మంత్రి ఉపకార వేతనం కూడా ఇప్పుడు కాశ్మీర్ స్టూడెంట్స్ కు అందుతుందని చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందే అన్ని ప్రయోజనాలు ఇక కాశ్మీర్ కు కూడా అందుతాయని, కాశ్మీర్ లో ఇక టూరిజం కొత్త పుంతలు తొక్కుతుందని .. హిందీ, తెలుగు తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక నుంచి కాశ్మీర్ లో ఫిలిం మేకింగ్ చేయొచ్చని మోడీ చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: