తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. గోదవరి నదిలో అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతుంది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో 47.7 అడుగుల నీటిమట్టం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. నీటిమట్టం 48 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌ వద్ద 14.60 అడుగుల నీటిమట్టం ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 


శుక్రవారం సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరికకు వరద చేరుకునే అవకాశం ఉంది. డెల్టా కాల్వలకు 7,700 క్యూసెక్కులు విడుదల చేయడంతో సముద్రంలోకి 13.97లక్షల క్యూసెక్కుల చేరుతుంది. భద్రాచలం వద్ద కూడా వరద ప్రవాహం భద్రాచలం వద్ద గోదావరిలో 47.7 అడుగుల నీటిమట్టం పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 
మరోవైపు జూరాల జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి పెద్దఎత్తున ప్రవాహం వస్తోంది. జూరాల జలాశయం ఇన్‌ఫ్లో 4 లక్షల 30 వేలు కాగా ఔట్‌ ఫ్లో 4 లక్షల 39 వేలుగా ఉంది. పూర్తిస్థాయి నిల్వసామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.050 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉంది.


శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 3లక్షల 58 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 878 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 182 టీఎంసీలు ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31 వేల 602 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.


హంద్రీనీవాకు వెయ్యి 351 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 735 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. శనివారం ఉదయానికల్లా శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండనుండగా జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ గేట్లు ఎత్తనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: