ఆదివాసీ మాతృభాషతో పాటు ఆదివాసీ సంస్కృతిపై కూడా ఆధిపత్య సంస్కృతి దాడి చేస్తున్నది. 'గోవు పవిత్రత' పేరుతో ఆదివాసీల ఆహారపు అలవాట్లపై దాడి చేస్తున్నారు. ఆదివాసీ ఆట, పాట, కట్టు, బొట్టు, పెళ్లి, ఆచార సాంప్రదాయాలపై మనువాద సంస్కృతిని రుద్దుతున్నారు. దాంతో ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలకు పెనుముప్పు వాటిల్లనున్నదని దళిత ఐక్య వేదిక వ్యవస్థాపకులు పినమాల నాగ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
వామపక్షాల ఒత్తిడి వలన 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం వచ్చింది. ఆదివాసీలకు చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది అడవిపై ఆదివాసీలకు హక్కు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. కానీ నేటి వరకు ఆదివాసీలకు భూమిపై హక్కులు ఇవ్వకుండా అటవీ అధికార్లు, ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. మోడీ ప్రభుత్వ ప్రోత్సాహంతో 2006 అటవీ హక్కుల చట్టం వలన అడవి నాశనమైపోతున్నదని విశ్రాంత అటవీ అధికార్లు సుప్రీం కోర్టుకు వెళ్లారు. మోడీ ప్రభుత్వం ఆదివాసీల తరపున కోర్టుకు లాయర్‌ను పంపకపోవడంతో ఆదివాసీల నుండి వాదించే నాథుడు లేక సుప్రీం కోర్టు పట్టాకై పెట్టిన అప్లికేషన్లు తిరస్కరించబడిన ఆదివాసీలందరినీ అడవి నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. దేశమంతా ఆందోళన చేయగా తాత్కాలికంగా స్టే ఇచ్చింది.



అటవీ చట్టం రిజర్వు అడవులు, రక్షిత అడవులు, కమ్యూనిటీ అడవులని వర్గీకరించింది. మోడీ ప్రభుత్వం వాణిజ్య అడవులను చట్టంలో చేరుస్తున్నది. వాణిజ్య అడవుల పేరుతో అడవులను కార్పొరేట్లకు ఇవ్వడమే దీని ఉద్దేశ్యం. ఒంటెను గుడారం లోకి రానిస్తే జరిగేదేమిటో తెలిసిందే. కార్పొరేట్లు అడవి లోకి ప్రవేశిస్తే ఆదివాసీలు అడవి నుండి పోవాల్సిందే. బ్రిటిష్‌ పాలకులు 1927 అటవీ చట్టంలో ఆదివాసీలను ఆక్రమణదార్లుగా ముద్ర వేశారు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగిన ఆదివాసీలను చొరబాటుదార్లుగా, ఆక్రమణదార్లుగా ప్రకటించి ఆదివాసీలను అష్ట కష్టాలపాలు చేసింది. ఈ1927 అటవీ చట్టానికి మోడీ ప్రభుత్వం సవరణలు చేస్తున్నది. బ్రిటిష్‌ వాడి చట్టం కంటే క్రూరమైనదిగా చట్టం రూపొందుతోంది. అటవీ ఉత్పత్తులను అడవి నుండి సేకరించాలంటే అటవీ అధికార్ల అనుమతి పొందాలి. లేకుంటే అటవీ ఉత్పత్తులు సేకరించడం నేరం అవుతుంది. అడవిలో సంచరించే ఆదివాసీలను ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయవచ్చు. తాము నేరం చేయలేదని ఆదివాసీలే నిరూపించుకోవాలి (నేరం మోపబడిన టెర్రరిస్టులే తాము నిర్దోషులమని నిరూపించుకోవాలనే టెర్రరిస్టు నిరోధక చట్టంలో సెక్షన్‌ను ఈ చట్టంలో పొందుపర్చింది). నెల నుండి 6 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. సెషన్సు కోర్టు తీర్పే ఫైనల్‌. పై కోర్టులకు అప్పీల్‌ చేసుకునే అవకాశం లేదు. పోలీసుతో పాటు, అటవీ అధికార్లకు తుపాకులు ఇచ్చి కాల్చి చంపే అధికారం ఇచ్చింది. ఈ 1927 అటవీ చట్టం సవరణలతో 2006 అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పీసా చట్టం గల్లంతే.


రాజ్యాంగం గిరిజనులకు రిజర్వేషన్లతోబాటు స్వయంప్రతిపత్తిని, ఆదివాసీ ప్రాంతాలలో ప్రత్యేక హక్కులను కల్పించింది. మోడీ ప్రభుత్వం కాశ్మీర్‌కు గల స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి తన పెత్తనం కిందకు తెచ్చుకున్నట్టే రేపు గిరిజన ప్రాంతాలకు సబంబంధించి 5వ, 6వ షెడ్యూళ్ల పైన దాడి చేయదని గ్యారంటీ ఏమీ లేదు. ప్రైవేటీకరణతో ఇప్పటికే రిజర్వేషన్లపై దాడి జరుగుతూనే వుంది. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో గత ఐదేళ్ళలో 5 లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్లకు ఇచ్చేసింది. కార్పొరేట్‌ కంపెనీల ఆక్రమణ, మైనింగ్‌ వలన తమ జీవితాలు ధ్వంసం అవుతున్నందున ఆదివాసీలు ప్రతిఘటిస్తున్నారు. ఆదివాసీలపై పోలీసు నిర్బంధాలతో పాటు కాల్చి చంపుతున్నారు. 1927 అటవీ చట్టాన్ని సవరణలు చేసి అమలు జరిపితే అడవి కార్పొరేట్లకు సొంతం అవుతుంది. ఆదివాసీలు ప్రతిఘటిస్తే అణచివేసేందుకు అటవీ భద్రతా కమిటీలో ఆర్మీ చీఫ్‌ను కూడా సభ్యుడిగా చేరుస్తూ 1927 అటవీ చట్టానికి మోడీ సవరణ చేస్తున్నారు. ఇంకోవైపు తెగల మధ్య ద్వేషాలు సృష్టించి గిరిజన సమాజాన్ని విభజించే కుట్రలు చేస్తున్నది.దేవుడి పేరుతో, మతం పేరుతో ఆదివాసీలను ముక్కలు ముక్కలు చేసే ఎత్తులు వేస్తున్నది. ఆదివాసీల భూమి మీద, ఉద్యోగాల మీద, భాషా సాంస్కృతీ సాంప్రదాయాల మీద జరుగుతున్న, జరగబోతున్న దాడుల నుండి ఆదివాసీలే రక్షించుకోవాలి. అలాగే హక్కులు హరించివేయబడి హంతక దాడులకు గురౌతున్న మైనారిటీలు, దళితులు, వృత్తిదార్లను కూడా తోడు చేసుకోవాలి. న్యాయమైన, ప్రజాతంత్ర హక్కుల రక్షణకు తమ ప్రాణాలను సహితం పణంగా పెడుతున్న సంస్థలు, శక్తుల సహాయం తీసుకోవాలి.


మోడీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేసింది. దీనితో ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌ కేటాయింపులు సగానికి సగం తగ్గించేసింది. ఉదాహరణకు 2019 సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ మొత్తం రూ.27,86,349 కోట్లు. అందులో నుండి గిరిజనులకు రూ.28,456 కోట్లు కేటాయింపుల్లో తగ్గించేసింది. 2015-16 నుండి 2019-20 వరకు ఇలా గిరిజనులకు తగ్గించిన బడ్జెట్‌ కేటాయింపులు రూ. 2,05,128 కోట్లు. ఎంత అన్యాయం? ఈ సంవత్సరం ఆదివాసీల ఉన్నత విద్యకు భారీగా కోత పెట్టింది. ఫెలోషిప్పులకు, స్కాలర్‌షిప్పులకు కన్నం పెట్టింది.
రాజ్యాంగం గిరిజనులకు రిజర్వేషన్లతోబాటు స్వయంప్రతిపత్తిని, ఆదివాసీ ప్రాంతాలలో ప్రత్యేక హక్కులను కల్పించింది. మోడీ ప్రభుత్వం కాశ్మీర్‌కు గల స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి తన పెత్తనం కిందకు తెచ్చుకున్నట్టే రేపు గిరిజన ప్రాంతాలకు సబంబంధించి 5వ, 6వ షెడ్యూళ్ల పైన దాడి చేయదని గ్యారంటీ ఏమీ లేదు. ప్రైవేటీకరణతో ఇప్పటికే రిజర్వేషన్లపై దాడి జరుగుతూనే వుంది.


మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో గత ఐదేళ్ళలో 5 లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్లకు ఇచ్చేసింది. కార్పొరేట్‌ కంపెనీల ఆక్రమణ, మైనింగ్‌ వలన తమ జీవితాలు ధ్వంసం అవుతున్నందున ఆదివాసీలు ప్రతిఘటిస్తున్నారు. ఆదివాసీలపై పోలీసు నిర్బంధాలతో పాటు కాల్చి చంపుతున్నారు. 1927 అటవీ చట్టాన్ని సవరణలు చేసి అమలు జరిపితే అడవి కార్పొరేట్లకు సొంతం అవుతుంది. ఆదివాసీలు ప్రతిఘటిస్తే అణచివేసేందుకు అటవీ భద్రతా కమిటీలో ఆర్మీ చీఫ్‌ను కూడా సభ్యుడిగా చేరుస్తూ 1927 అటవీ చట్టానికి మోడీ సవరణ చేస్తున్నారు. ఇంకోవైపు తెగల మధ్య ద్వేషాలు సృష్టించి గిరిజన సమాజాన్ని విభజించే కుట్రలు చేస్తున్నది.దేవుడి పేరుతో, మతం పేరుతో ఆదివాసీలను ముక్కలు ముక్కలు చేసే ఎత్తులు వేస్తున్నదని నాగ కుమార్  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: