ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం...

నేను అనగా పింగళి వెంకయ్య గారి మనవడు పింగళి దశరధరామ్ (ఎన్ కైంటర్ దశరధరామ్) భార్య పింగళి సుశీలగా ఒక విషయం తెలియపరచవలసిన సందర్భం వచ్చినది. పింగళి వెంకయ్య గారికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పరశురామయ్య గారు, భార్య హైమవతి, చిన్న కుమారుడు హేరంభ చలపతిరావు ఆయన భార్య జానకీ దేవి వీరు నలుగురు దాదాపు 25 సం||లు క్రితమే చనిపోయారు. వెంకయ్య గారి ఏకైక మనవడు ఎన్ క్లైంటర్ దశరధరామ్ కూడా.


1985లో హత్యగావింపబడ్డారు. ఆయనకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల ఇది పత్రికా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దశరధరామ్ భార్యగా నేను ఒక విన్నపము చేస్తున్నాను. పింగళి వెంకయ్య గారు జాతీయ నాయకుడు, ఆయన జీవితం భారత జాతి చరిత్రలో ముడిపడి ఉంది. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఈ మధ్య కొన్ని న్యూస్ చానెల్స్ లో పింగళి వెంకయ్య గారి కోడలు ఏలూరులో గుడి మెట్ల మీద బిక్షాటన చేస్తోందని ఆమెకు ప్రభుత్వం సహాయం చేస్తానన్నా తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి. ఒక ఆనాదకి చేయూత నివ్వడం హర్షించ దగ్గ విషయమే కాని ఆమెకు పింగళి వెంకయ్య గారు కోడలుగా ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటు. ఆమె పింగళి వెంకయ్య గారి కోడలు కాదు. పింగళి ఇంటి పేరిట చాలా మంది ఉన్నారు. ఆమె ఎవరికి సంబంధించిన వ్యక్తి పూర్తిగా సమాచారం సేకరించి ప్రచారం చేస్తే బాగుండేది. ఆమెకు పింగళి వెంకయ్య గారి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు.


1999 సం.లో శ్రీమతి కె. హెచ్.యస్. జగదంబ గారు శ్రీ పింగళి వెంకయ్య ఛారిటబుల్ ట్రస్ట్ & స్మారకా సంస్థను స్థాపించి ఆయన జీవిత విషయాలను ప్రజానీకానికి అందజేస్తున్నారు. మేము అనగా పింగళి వెంకయ్య గారి వారసులుగా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాము. ఎన్నో రంగాల్లో నిష్ణాతుడైన పింగళి వెంకయ్య గారికి “భారతరత్న' ఇవ్వడం సముచితంగా భావించి మా సంస్థ ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ విషయం పరిగణలోకి తీసుకొని ఆయన చరిత్రకు లేనిపోని కథలు అనుచిత వ్యాఖ్యాలు చేయవద్దని మా ట్రస్ట్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. పింగళి వెంకయ్య గారి ఘనత న్యూస్ చానెల్ ప్రచారం చేసి ఆ ఆంధ్రుడికి దక్కవలసిన గౌరవం దక్కే విధంగా ప్రయత్నిస్తున్నపుడు మా వంతు సహకారం 100 శాతం ఉంటుందని తెలియజేస్తున్నాము. 

సుశీల దశరధరామ్ పింగళి సెల్:9440138527


కుర్చీపై కూర్చున్నది పింగళి కుటుంబ సభ్యుల ఫోటో కాదు



ఇక్కడ గుడి మెట్ల వద్ద కుర్చీలో కూర్చున్న ఆవిడ ఎవరో మీకు తెలుసా...?. ఈమె మన భారతదేశ జాతీయ జెండా రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్యకి స్వయానా కోడలు. ఆమె ఏలూరులోని ఒక గుడిమెట్లు వద్ద బిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. దేశమంతా స్వాతంత్య దినోత్సవం జరుపంకుంటున్న  వేళ వెలుగు చూసిన సంఘటన ఇది. ఈ విషయాన్ని గుర్తించిన ఆ జిల్లా కలెక్టర్ ఆగష్టు రెండవ తేదీన  పింగళి వెంకయ్య గారి జన్మదినం సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులను కలసి ఆమె గురించి తెలుసుకుని ఆమె వద్దకు వెళ్ళి పళ్ళు, పలహారాలు అందించారు. అమ్మ ఇక నుంచి ప్రభుత్వ ఖర్చుతో నీకు అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తాను ప్రభుత్వానికి భారం కాదల్చుకోలేదు చెప్పారంట. ఈ సందర్భంగా అసలు పింగళి గురించి గుర్తు చేసుకుందాం.


1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు.  1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను సమకూర్చాడు వెంకయ్య.


అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు, సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు.1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం.


అలాంటి పింగళి ఇంటి కొడలు ధీనావస్థలో ఉంది. దీనిపై స్పందించిన కలెక్టర్ ముందుకు వచ్చి  ఏదైనా ఓల్డేజ్ హోమ్ లో చేరుస్తాము రండి అని చెప్పినా సున్నితంగా తిరస్కరించారు. తాను ఈ గుడి వద్దనే ఉంటూ దైవస్మరణ చేసుకుంటూ బ్రతుకుతాను అని తేల్చి చెప్పిన మహోన్నుతరాలు ఆమె.  మావయ్య పింగళి వెంకయ్య మహానుబావులు అటువంటి కుటుంబానికి తాను కోడలుగా రావడమే తన అదృష్టం అని చెప్పారు. ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి ఆయనకి తలవంపులు తీసుకురాలేను అని చెప్పారంట. మహానుభావులు పింగళి  కోడల్ని ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకోవడం చాలా భాదాకరం కదండి.


ఇది కేవలం కొన్ని వైరల్ న్యూస్ లో వస్తున్న టాపిక్ గా కవర్ చేసింది..అసలు వివరణ కుటుంబ సభ్యులు ఇవ్వగా. ఫేక్ ఫోటోలు నమ్మవొద్దని పింగళి కుటుంబ సభ్యులు నెటిజన్లకు విన్నవిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: