ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన విషయంలో కేంద్రం పక్కా వ్యూహంతో అమలు చేసి విజయం సాధించింది.  ఈ పధకం అమలు వెనుక చాలా పెద్ద వ్యూహం ఉన్నది.  దీనికోసం చాలా రిహార్సిల్స్ చేశారు.  రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి త్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు.  ఈ బిల్లు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నది.  లోక్ సభలో బలం ఉన్నప్పటికీ రాజ్యసభలో సరైన బలం లేకపోవడంతో పెద్దల సభలో ఆమోదం లభించలేదు.  



రెండోసారి ఎంపికయ్యాక త్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టి.. ఈజీగా విజయం సాధించింది.  ఇది బీజేపీకి పెద్ద విజయంగా చెప్పొచ్చు.  ఈ బిల్లును ప్రవేశపెట్టి విజయం సాధించిన తరువాత... బీజేపీ ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించింది.  అది పక్కా వ్యూహంతో.. జమ్మూ కాశ్మీర్ లో ఆగష్టు 1 వ తేదీ నుంచి  పెద్ద ఎత్తున బలగాలను పంపడం మొదలుపెట్టింది.  



ఇలా పెద్ద ఎత్తున బలగాలను పంపడంతో అక్కడ ఏదో జరగబోతున్నట్టు ప్రజలకు అర్ధం అయ్యింది.  కావాల్సిన సరుకులు సారంగమా అన్ని ముందుగానే కొనుగోలు చేసుకొని ఇంట్లో పెట్టుకున్నారు.  ఆగష్టు 5 అర్ధరాత్రి నుంచి జమ్మూ కాశ్మీర్ లో 144 వ సెక్షన్ అమలు చేశారు.  ఎందుకు ఏంటి అన్నది ఎవరికీ తెలియదు.  కేంద్రమంత్రి వర్గ సమావేశం ప్రతి బుధవారం జరుగుతుంది.  కానీ, సోమవారం అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం ప్రధాని నివాసంలో జరిగింది.  



అప్పటి వరకు అతి కొద్దిమందికి తప్పించి ఎవరికి ఈ విషయం తెలియదు. లోక్ సభలో బిల్లు ప్రవేశపెడితే గందరగోళం జరగడంతో పాటు బిల్లు ఆమోదానికి రాజ్యసభలో ఇబ్బంది అవుతుంది.  అందుకే మొదట రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాలని అనుకుంది.  మోడీ ముందురోజే వెంకటయ్య నాయుడిని కలవడం.. అధికారాల గురించి చర్చిండం జరిగిపోయాయి.  కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా చాలా తెలివిగా వ్యవహరించి బిల్లును ప్రవేశపెట్టారు.  ఈ బిల్లును రెండు సభల్లో ఆమోదం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: