కీర్తి సురేశ్... మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. మహానటి సావిత్రి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ఈ సినిమా కీర్తి సురేశ్ నట జీవితంలోనే ఓ మేలు వజ్రం. ఆమె కెరీర్ లోనే ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమా విడుదలైన వెంటనే కీర్తి సురేశ్ నటనకు ప్రశంసలు వచ్చాయి. అవార్డుల పంట ఖాయం అన్నారు.


ఇప్పుడు అనుకున్నట్టే అయ్యింది... కానీ ఏకంగా జాతీయ ఉత్తమనటి అవార్డు దక్కడం కీర్తి సురేశ్ ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఇదే సయమంలో ఆమె మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే... ఇక ఆమె ఎలాంటి బయో పిక్స్ సినిమాల్లో నటించదట.


ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ... ఇప్పుడు కూడా చాలా మంది మరో బయోపిక్‌ ఒప్పుకొంటారా అని అడుగుతుంటారు. కానీ ఇక నేను బయోపిక్స్ లో నటించను. మహానటే నా మొదటి బయోపిక్.. ఇదే చివరిది కూడా . ఈ నిర్ణయం ఎందుకంటే... మహానటి లాంటి పాత్రలో నటించి మరో పాత్ర చేయాలని అనిపించడం లేదు. ఈ సినిమా నాపై అంత ప్రభావం చూపించింది అంటోంది కీర్తి సురేష్.


ఈ సందర్భంగా మహానటి షూటింగ్ అనుభవాలను మీడియాతో పంచుకుంది కీర్తి సురేశ్.. షూటింగ్ పూర్తయ్యే ముందు కీర్తి సురేష్ ఏడిచేసిందట. ప్రత్యేకించి పెద్దనాన్నగా నటించిన రాజేంద్రప్రసాద్‌ షూటింగ్‌ తర్వాత వెళ్తుంటే... ఏడుపొచ్చేసిందట. ఆయన్ను కీర్తి సురేశ్ గట్టిగా హత్తుకుని ఏడ్చేసిందట. అందుకే మహానటి తర్వాత మరే బయోపిక్ కూడా చేయకూడదని డిసైడైందట మహానటి.. అదే కీర్తి సురేశ్.


మహానటి చిత్రం రిలీజ్ తర్వాత అభిమానులే కాదు.. విమర్శకులు కూడా శెభాష్ అన్నారట. ఇక ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డు అందుకోబోతున్నా... అంటూ ఆనందపడిపోయింది కీర్తి సురేష్. ఈ అవార్డు తనకు రావడానికి కారణమైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటోందీ మహానటి.


మరింత సమాచారం తెలుసుకోండి: