హీరో

  వరదలు తుఫానులు మొదలగు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మన రక్షణ సిబ్బంది మరియు స్థానిక పోలీసులు నిర్వర్తించే పాత్ర ముఖ్యమైనది.   ఆపదలో ఉన్న వారిని మేమున్నామంటూ ఆదుకునే తీరు సర్వత్రా హర్షణీయం. ఏ విపత్తు సంభవించినా ముందుగా రంగంలోకి దిగి సహాయ పునరావాస చర్యలను  ప్రారంభం చేసేది స్థానిక పోలీసులు మాత్రమే.

 మొక్కవోని ధైర్యంతో, విధి నిర్వహణలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదురు నిలిచి పోరాడటం వారికి వెన్నతో పెట్టిన విద్య.   ఈ కోవకు చెందినదే గుజరాత్లోని పోలీస్ కానిస్టేబుల్ శ్రీ పృద్వి రాజ్ సింగ్ జడేజా సాహసం. మొక్కవోని ధైర్యంతో ఆయన చేసిన  ఈ సాహసం అందరి మన్ననలను అందుకున్నది.

 ఈమధ్య భారీ వర్షాలకు గుజరాత్ నదులు పొంగి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.  అహ్మదాబాద్ పట్టణానికి సమీపంలో ఉండే ఒక గ్రామంలో వరద నీటిలో ఇద్దరు బాలికలు చిక్కుకుపోయారు వారిని రక్షించడానికి  అక్కడ సహాయ పునరావాస చర్యల విధులు నిర్వహిస్తున్న శ్రీ పృద్వి రాజ్ సింగ్ జడేజా నడుం కట్టారు. ఈ క్రమంలో ఆయన చేసిన సాహసం మాటలకందనిది.  శ్రీ పృథ్వి రాజ్ సింగ్ జడేజా వరద నీటిలో చిక్కుకున్న పోయినా ఆ ఇద్దరు బాలికలను తన భుజాలపై ఎక్కించుకొని నడుము లోతు నీళ్లలో చాలా దూరం నడుచుకుంటూ వారిని సురక్షిత ప్రాంతానికి చేరవేశాడు.

  ఆయన చేసిన ఈ చర్య  గుజరాత్ ముఖ్యమంత్రి మొదలుకొని పలువురు  ప్రముఖుల ప్రశంసలందుకుంది. అందరితోనూ శభాష్ అనిపించుకున్న శ్రీ పృథ్వి రాజ్ సింగ్  జడేజా ను మనం కూడా అభినందించకుండా ఉండలేము కదా


మరింత సమాచారం తెలుసుకోండి: