దేశ వ్యాప్తంగా ఇప్పుడు బీజేపీ హవా నడుస్తుంది.  ఇప్పటికే చాలా మంది సీనియర్, జూనియర్ నేతలు బీజేపీలో చేరిపోతున్నారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోదీ మానియా ఏ రేంజ్ లో సాగిందో అందరికీ తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయన రెండో సారి ప్రధాని పదవిలోకి వచ్చారు.  గత ఐదు సంవత్సరాల్లో మెదీ పాలన పై ప్రజలు పెంచుకున్న నమ్మకమే ఆయను మరోసారి ప్రధానిని చేసిందని బీజేపీ నేతలు అంటున్న మాటలు. 

అంతే కాదు ప్రధాని మోదీ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు కూడా ప్రతిపక్ష నేతలకు మింగుడు పడని విషయంగా మారింది. మోదీ పాలనపై ఇప్పుడు నేతలకు కూడా నమ్మకం కలిగింది..అందుకే బీజేపీలో చేరుతున్నారు.  తాజాగా సీనియ‌ర్ పొలిటిషీయ‌న్‌, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో  చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం మోత్కుపల్లి నర్సింహులుతో స‌మావేశ‌మ‌య్యారు. 

ఒకప్పుడు టీడీపీ కి వీర విధేయుడుగా ఉన్న మోత్కుపల్లి ఆ మద్య ఏపికి గవర్నర్ గా రాబోతున్నారని తెగ వార్తలు వచ్చాయి..కానీ అలా జరగకపోవడతో టీడీపీని ఎండగట్టారు మోత్కుపల్లి..అంతే కాదు చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.   ఇటీవ‌ల ఏపీలో టీడీపీ ఓడిపోయిన‌ప్పుడు కూడా ఆయ‌న ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద నివాళులు అర్పించి... ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ శాంతిచింద‌న్న వ్యాఖ్య‌లు చేసి రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు రేపారు. 2009లో న‌ల్గ‌గొండ జిల్లా తుంగ‌తుర్తి నుంచి పోటీ చేసి గెలిచిన మోత్కుప‌ల్లి, 2014లో అప్పుడు ఖ‌మ్మం ఎంపీగా పోటీ చేసిన నామా నాగేశ్వ‌ర‌రావు కోరిక మేర‌కు మ‌ధిర నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

రెండేళ్ల క్రితం వ‌ర‌కు టీడీపీలోనే ఉన్న మోత్కుప‌ల్లి చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి... ఆ పార్టీకి దూర‌మ‌య్యారు.  ఈ నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ లో జాయిన్ అవుతారని తెగ వార్తలు వచ్చాయి..అంతే కాదు మోత్కుప‌ల్లి త‌న ఇంట్లో వివాహ కార్య‌క్ర‌మానికి కేసీఆర్‌ను ఆహ్వానించ‌గా.. ముఖ్య‌మంత్రి హోదాలో వెళ్లి మ‌రీ కేసీఆర్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. కానీ ఆయన టీఆర్ఎస్ లో చేరలేదు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. మోత్కుప‌ల్లి ఈ నెల 18న బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.  మరి మోత్కుపల్లి బీజేపీలో ఎలా సత్తా చాటుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: