స్వామీజీలకు వయసుతో పని లేదు. వారు శరీరాన్ని ఒక సాధనంగా చూస్తారు. వారి అధ్యాత్మిక భావన అలా ముందుకు నడిపిస్తుంది. యోగాతో పాటు, ప్రాణాయామం వంటివి సాధన చేస్తూ జీవితాన్ని పొడిగించుకుంటారు. మనసు, శరీరాన్ని ఒకే తీరున  ఉంచుకోగలుగుతారు. ఆ స్వామి పేరు హరే రాం స్వామీజీ. ఆయన జీవితం అంతా రామ నామానికే అంకితం చేశారు.


ఎక్కడో నెల్లూరు నుంచి నలభయ్యేళ్ళ క్రితం విశాఖ జిల్లా వచ్చేశారు. రూరల్ జిల్లాలో ఉన్న ఎలమంచిలిలో స్థావరం ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఆధ్యాత్మిక బోధ చేస్తూ గడిపారు. ఆ స్వామి గొప్పతనం ఏంటంటే ఏకంగా 850 కి పైగా రామాలయాలు నిర్మించారు. ప్రజలందరినీ కలుపుతూ భక్తిగా రామనామం పాడించారు.


స్వామి మరో విశేషం ఏంటంటే ఆయన శివైక్యం చెందేవరకూ తన వంట తనే చేసుకున్నారు. తన పనులు తానే చేసుకున్నారు. ప్రజలకు మంచి చెప్పడం కోసమే తన జీవితం మొత్తాన్ని అంకితం చేసిన ఆ స్వామికి దర్శించుకుని ప్రజలు తమ బాధలు చెప్పుకునేవారు దేవదూతలా గ్రామీణ ప్రజలకు కనిపించి వారిని సన్మార్గంలో నడిపించిన ఆ స్వామిజీ ఇక లేరు. ఆయన నిన్న  శివైక్యం అయ్యారు.


ఈ విషాద వార్త వినగానే వూరు అంతా పరిగెట్టుకుని వచ్చింది. ఒక్క విశాఖ జిల్లా నుంచే కాకుండా ఉత్తరాంధ్రాలోని గ్రామాల ప్రజలు కడసరి చూసేందుకు క్యూ కట్టారు. స్వామిని తలచుకుని విలపించారు. ఇదిలా వుండగా స్వామి అంత్యక్రియలు  ఘనంగా జరిపించారు. వూరూ వాడా ఒక్కటై కన్నీరు పెడుతూ స్వామిని భువి నుంచి భువికి పంపారు. శతాధిక వ్రుధ్ధునిగా, స్వామిజీగా హరే రాం బాబా విశాఖ జిల్లా వాసులకు ఎప్పటికీ  గుర్తుండిపోతారు. ఆయన ఆధ్యాత్మిక గురుతులను పదిలపరచుకునేందుకు స్వామీజీ ఉన్న ఆశ్రమాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజలు నిర్ణయించడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: