మాములుగా టమోటా ధర ఎంత ఉంటుంది మహా అయితే 20 రూపాయలు ఉంటుంది.  వర్షాలు కురిసి ధరలు పెరిగితే 50 రూపాయల వరకు డిమాండ్ ఉంటుంది.  అంతకు మించి ఇండియాలో ధరలు పెరగవు.  ఇండియాలో వివిధ ప్రాంతాల్లో టమోటా ఎక్కువగా పండుతుంది.  ధరలు ఎంత పెరిగినా 50 రూపాయలకు మించి పెరగవు.  1998 కాలంలో ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఉల్లి దెబ్బకు ఢిల్లీ ప్రభుత్వం కూడా కూలిపోయింది.  


ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ విభజన తరువాత ఇండియా, పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి.  వాణిజ్యఒప్పందాలను రద్దు చేసుకుంది.  ఇండియాతో వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవడం వలన ఇండియాకు వచ్చే నష్టం రూ. 50 కోట్లు.  ఇండియా నుంచి వేలాది కోట్ల రూపాయల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటుంది.  ఇందులో టమోటా, ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటాయి.  


పాకిస్తాన్ లో వినియోగించే టమోటా లో 80% ఇండియా నుంచి దిగుమతి చేసుకున్నదే.  వాణిజ్య ఒప్పందం రద్దు కావడంతో ఇండియా నుంచి ఎగుమతి ఆగిపోయింది.  దీంతో అక్కడ టమోటా రేటు గుండె పోటును తెప్పిస్తోంది.  కిలో టమోటా ధర దాదాపు రూ. 300/- పలుకుతోంది.  ఈ ధరను చూసి పాక్ వినియోగదారులు షాక్ అవుతున్నారు. పండుగ రోజున ఎక్కువగా ఉపయోగించే టమోటా ధరలు ఇలా అమాంతంగా కొండెక్కి కూర్చుంటే ఎలా అని మండిపడుతున్నారు.  


వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం రద్దును రద్దు చేయాలని పాక్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  సామాన్య ప్రజల దుస్థితి దారుణంగా మారిపోయిందని, చక్కగా పండుగ చేసుకోవడానికి కూడా వీలులేకుండా పోయిందని వాపోతున్నారు.  మరికొన్ని రోజులు ఇలానే జరిగితే టమోటా ధర రూ. 500/- లను కూడా దాటిపోతుంది అనడంలో సందేహం లేదు.  ఆఫ్గనిస్తాన్ నుంచి టమోటా దిగుమతి చేసుకుంటున్నా కనీస అవసరాలకు సరిపోవడం లేదట.  


మరింత సమాచారం తెలుసుకోండి: