ఈ మద్య దొంగతనాలకు పాల్పపడేవారిని, ట్రాఫిక్ లో రూల్స్ అతిక్రమించిన వారిని అధికారుల వినూత్న తరహాలో శిక్షలు విధిస్తున్నారు.  ప్రస్తుతం ప్రపంచం మొత్తం కాలుష్యం భారిన పడుతుంది.  మనిషి టెక్నాలజీ పరంగా ఎంత పెరిగిపోతున్నా..దానితో పాటే ప్రకృతి వినాశనం కూడా జరుగుతుంది. దాంతో కొంత కాలానికి మనిషి ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.  వినాశనమవుతున్న ప్రకృతి సంపదను కాపాడేందుకు పరిష్కారం కేవలం ఒక్కటే..అదే చెట్లను పరిరక్షించడం..నాటడం. 

ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  చేసిన నేరం నుంచి తప్పించుకునేందుకు వెసులు బాటు కల్పించింది. మొక్కలు  నాటితే కేసు మాఫీ అయ్యేలా తీర్పునిచ్చింది. ఈ సంఘటన పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ దొంగతనం కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదర్శనీయమైన తీర్పు ఇచ్చింది. చోరీకి పాల్పడిన వ్యక్తిని నెల లోగా 50 మొక్కలు నాటాలని ఆదేశించింది.

ఆ వివరాలు తెలుసుకుందాం. దొంగల్ని జైలుకి పంపితే ఏమవుతుంది... నాలుగు గోడల మధ్య కూర్చొని కాలక్షేపం చేస్తారు. దాని బదులు... సామాజిక కార్యకలాపాలు చేయిస్తే... సమాజానికి మేలు జరుగుతుంది... అని ఆలోచించిన ఢిల్లీ హైకోర్టు... ఆ దొంగను 50 మొక్కలు (దాదాపు చెట్ల లాంటివి) నాటాలని ఆదేశించింది. అందుకు ఒప్పుకుంటే... అతనిపై ఉన్న చోరీ కేసు విచారణను క్లోజ్ చేస్తామని ప్రకటించింది.

నెలరోజుల్లో మొక్కలు పాతాలనీ..., పశ్చిమ అటవీశాఖ డిప్యూటీ కన్సర్వేటర్... సెంట్రల్ రిడ్జ్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎక్కడ మొక్కలు పాతమంటే అక్కడ పాతాలని ఆదేశించింది. అంతేకాదు... ప్రతీ మొక్క వయసూ 3 నుంచీ 3న్నర ఏళ్లకు పైగా ఉండాలనీ, మొక్క ఎత్తు దాదాపు 6 అడుగులు ఉండాలని ఆర్డరేసింది. ఏ మొక్కలు పాతాలో డిప్యూటీ కన్సర్వేటర్ చెబుతారని  జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: