జగన్ పట్టుదల గ‌ల మనిషి. ఈ విషయం ఎవరో చెబితే వినక్కర్లేదు. అందరికీ తెలిసిందే. ఆయన అనుకున్నది చేసేస్తారు. ఆయన మార్గం దుర్గమం అయినా దాన్ని అనుసరించి ముందుకు సాగిపోతారు. కొండలు, లోయలు అడ్డుపడినా వెనకంజ వేయరు. మారి ఆయన ఒక్కడిగా బయలేరి ఇంత సామ్రాజ్యం నిర్మించారు. తనకంటూ టీం ని తయారుచేసుకున్నారు. ఏపీలో కూడా కొత్త నాయకత్వాన్ని అందిస్తున్నారు.


మరి ఈ విషయంలో ఆయన ఎంపిక చెసిన వారిలో ఎందరు పనితీరు బాగా కనబరుస్తున్నారు. ఎందరు పాస్ అయ్యారు, మరెందరు ఫెయిల్ అయ్యారన్నది ఇపుడు పార్టీలో సీరియస్ చర్చగా ఉంది. ఎందుకంటే కేవలం రెండున్నర నెలల వ్యవధిలోనే జగన్ తన పార్టీ ఎంపీలకు, మంత్రులకు కూడా మార్కులు వేయడం మొదలెట్టారు. మంత్రుల్లో సగానికి సగం మంది పాస్ మార్కుల వద్ద నిలిచిపోతే వారిని పనిచేయమని జగన్ ఆదేశాలు జారీ చేశారు. 


మహిళా మంత్రుల్లో కూడా ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు దూకుడుగా లేరని హెచ్చరికలూ జారీ చేశారు. ఇపుడు జగన్ ఎంపీల మీద చూపు సారించారు. వారి పనితీరు ఎలా ఉందన్నది లెక్కలు వేస్తున్నారు. జగన్ వేసిన మార్కుల ప్రకారం 14 మంది ఎంపీలు ఫెయిల్ అయ్యారట. వింటే ఇది నిజంగా దారుణమైన రిజల్టే అనిపించకమానదు. ఎందుకంటే ప్రజలు జగన్ మాట మీద 22 మంది ఎంపీలను గెలిపిస్తే వారిలో కేవలం ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తున్నారు  అంటే షాకింగ్ లాంటి పరిణామమే.  


తాజాగా ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో నోరు విప్పని ఎంపీల్లో వైసీపీ వారే అధికంగా ఉన్నారట. దీంతో జగన్ సీరియస్ అయి పనితీరు మార్చుకోవాలని సూచిస్తున్నట్లుగా తెలిసింది. మరో సారి పనితీరులో ఇలాంటి రిజల్ట్ రాకూడదని ఆయన అంటున్నారుట. ఇక మిగిలింది ఎమ్మెల్యేల వంతుట. తొందరలోనే ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా జగన్ ద్రుష్టి పెట్టి మార్కులు వేస్తారట. చూడాలి అందులో ఎంతమంది పాస్ అవుతారో.


మరింత సమాచారం తెలుసుకోండి: