జమ్ము కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు చేసి కేంద్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేంద్రం జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయటంపై భారతదేశం ప్రజలందరూ మోదీ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేస్తారని, రెండో రాజధానిగా చేయటంతో పాటు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
హైదరాబాద్ ను రెండో రాజధాని చేయటం ద్వారా దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ బలపడాలని ఆలోచిస్తుందని సమాచారం. ఇలా ప్రచారం జరుగుతూ ఉండటంతో హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా కొనసాగుతుందా లేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంత్రమైతే రాజ్యాంగం ప్రకారం హైదరాబాద్ ను కేంద్రం పరిపాలిస్తుంది. రాష్ట్రాలకు ఉండే అధికారాలు ఏవీ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉండవు. 
 
అంతర్ రాష్ట్ర వివాదాలలో ఉండే ప్రాంతాలను, ప్రధాన భూభాగానికి దూరంగా ఉండే ప్రాంతాలను సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క పాలనా వ్యవహారాలు నిర్వహిస్తుంది.ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమైనప్పటికీ ఈ ప్రాంతానికి అసెంబ్లీ ఉంది. దేశ రాజధాని అయిన ఢిల్లీకి అసెంబ్లీ మాత్రమే కాక ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. 
 
తెలంగాణ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తారని వస్తున్న వార్తలపై స్పందించారు. ఈ వార్తలు అన్నీ వదంతులని ప్రజలు ఇలాంటి వార్తలు నమ్మవద్దని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్టంలో టీ ఆర్ ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనని తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడదని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: