ఈరోజు భారతదేశం 72 వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది.   ఈరోజు జరుపుకోబోతున్న ఈ వేడుకలు చాలా ప్రత్యేకమైనవి అనే చెప్పాలి.  ఎందుకంటే, 71 సంవత్సరాలు ఈ వేడుకలు జరుపుకున్నా.. ఎదో తెలియని వెలితి స్పష్టంగా కనిపించింది.   1947 లో  దేశంలో ఉన్న 534 సంస్థానాలు, ఇతర చిన్న చిన్న రాజ్యాలు అన్ని కలిసి భారతదేశంగా ఏర్పడ్డాయి.  అయితే, జమ్మూ కాశ్మీర్ మాత్రం అప్పటికి సపరేట్ గా ఉన్నది.  


దేశంలో భాగంగా ఉన్నప్పటికీ ప్రత్యేక జెండా, అజెండా ఉండటంతో విశేషం.  దీంతో జమ్మూ కాశ్మీ ఇండియాలో ఉన్నా.. అది స్వంతంత్రంగా ఉన్నది. ఆ మరుసటి సంవత్సరం పాకిస్తాన్ దురాక్రమణ కారణంగా కొంతభాగాన్ని కోల్పోయాం.  ఇది ఇండియాకు తీరని దెబ్బగా చెప్పాలి.  అప్పటి నుంచి బోర్డర్ లో ఇండియా నిత్యం అలర్ట్ గా ఉంటూ వస్తున్నది.  


1954 వ సంవత్సరంలో ఆర్టికల్ 370 ని ప్రవేశపెట్టారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు.  ఆ రాష్ట్రం విషయంలో ఇండియా ఆర్థికం, రక్షణ, విదేశీ వ్యవహారాలు మినహా మరే విషయంలోనైనా చట్టాలు చేయాలి అంటే ఆ రాష్ట్రం అనుమతి తీసుకోవాలి.  ఇది ఆ రాష్ట్రానికి కలిసి వచ్చింది.  కాలం మారడంతో.. అక్కడి రాజకీయ నేతల్లో మార్పులు వచ్చాయి.  దురాక్రమణలు ఎక్కువయ్యాయి.  


అభివృద్ధికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఆమడ దూరంలో ఉండిపోయింది. ఉద్యోగాలు లేకపోవడంతో యువత ఉగ్రవాదం వైపు మళ్లింది.  నిరంతరం బోర్డర్లో కాపలా కాసే సైనికులపై రాళ్ళూ రువ్వడం, వాళ్ళను అక్కడ కొట్టి చంపడం చేస్తున్నారు.  దీంతో సైనికులు జమ్మూ కాశ్మీర్లో శత్రువుల చేతుల్లో కంటే.. రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్ యువత చేతిలోనే ఎక్కువగా అవమానాల పాలవాల్సి వచ్చింది.  అల్లరి మూకను అరెస్ట్ చేసే అధికారం లేకపోడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.  అయితే, మోడీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు పూర్తిగా ఇండియాలో అంతర్భాగం అయ్యింది.  జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు.  అందుకే ఈ స్వాతంత్ర దినోత్సవం ఇండియాకు వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: