భారత దేశం అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్ల లో పెట్టుబడుల గురించి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మాట్లాడుతూ,  5 ట్రిలియన్ డాలర్ల  లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 100 లక్షల కోట్లు  ఖర్చు చేస్తామని, ప్రస్తుతం  ఆర్థిక వ్యవస్థ  మంద గమనంగా నడుస్తోందని చెప్పారు.


భారత దేశానికి వచ్చే పెట్టుబడుల సమయం లో, పెట్టుబడి పెట్టేవారు మన దేశాన్ని మౌళిక సదుపాయాల విషయం లో  అనుమానంతో చూడకూడదని అన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించగల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, 73 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట  నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పిఎం మోడీ, ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయని మరియు మనం  పాటిస్తున్న విధి విధానాలతో పాటు స్థిరమైన ప్రభుత్వం  భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి, ఇతర దేశాలను ఆకర్షించడంలో ఉత్ప్రేరకం లా పని చేస్తుందని తెలిపారు . 


ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: ముఖ్య అంశాలు "మేము 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నాము. చాలా మంది కష్టమని భావిస్తారు. కాని మనం కష్టమైన పనులు చేయకపోతే మనం ఎలా పురోగతి సాధిస్తాము?, 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణాన్ని చేరుకోవడానికి 70 సంవత్సరాలు పట్టింది, గత ఒక సంవత్సరంలో మాత్రమే మేము 1 ట్రిలియన్ డాలర్లను చేర్చుకున్నాము. రాబోయే 5 సంవత్సరాల్లో దీనిని 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లగలమని  మాకు నమ్మకం ఉందని" అని ప్రధాని చెప్పారు. 


మౌలిక సదుపాయాలలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని మోదీ అన్నారు. దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 100 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఆస్పత్రులు, విద్యాసంస్థల నిర్మాణంలో ఈ పెట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: