దేశమంతా తన ప్రాబల్యాన్ని చూపుతున్న బీజేపీకి తెలుగు రాష్ట్రాలు మాత్రం చిక్కడం లేదు. తెలుగు ప్రజల భావాలు, ఆలోచనలు వారికి మింగుడుపడడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తమ హవా ఎలాగైనా పెంచుకోవాలని తాపత్రయపడుతోంది. కానీ ఏపీకి చేయాల్సిన సాయంలో వివక్ష చూపుతున్న కారణంగా బీజేపీ పై ఆ పార్టీ నాయకులకు తప్ప ప్రజలకు సదభిప్రాయం లేదు. కానీ నాయకులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటివల స్మృతీ ఇరానీ తెలుగులో చేసిన ట్వీట్ తెలుగు యువతను ఆకట్టుకోవడానికేనా అనే సందేహాలు వస్తున్నాయి.


 

కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇటివల ప్రారంభించిన ‘సమర్ధ్’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ యువతలోకి తీసుకెళ్లడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇందుకు ట్విట్టర్ ను వేదికగా చేసుకుని తెలుగులో ఆమె చేసిన ట్వీట్ ఇందుకు చర్చనీయాంశమైంది.  దేశంలోని 16 రాష్ట్రాలు ఈ పథకంలో చేరాయి. ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేయాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 12,000 మందికి దుస్తుల తయారీ, చేనేత రంగంలో శిక్షణనివ్వాలని నిర్దేశించుకుంది. ఇందుకు కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం కూడా అవసరం. దీంతో ఆమె తెలుగులో ట్వీట్ చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని ఓ వీడియో రూపంలో తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని దేవాలయాలు, ఆధ్యాత్మిక భావాలను కలగలిపి ఈ వీడియోలో పొందుపరిచారు.

 


సమర్ధ్ పథకం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగానే లభిస్తాయి. ఇది సంతోషించదగ్గ విషయమే. కానీ.. ఏపీ ఎప్పుడూ బీజేపీకి కొరకరాని కొయ్యగానే కనపడుతోంది. దీంతో యువతను, ప్రజలను ఆకట్టుకునే పలు రంగాల్లో వీరికి గాలం వేయాలని చూస్తోంది. భవిష్యత్తులో ఎన్నెన్ని ప్రాజెక్టుల ద్వారా తెలుగు వారికి బీజేపీ దగ్గరవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: